Alimineti Madhava Reddy : చంద్రబాబును నీడలా వెంటాడుతున్న మాధవరెడ్డి.. ?
Alimineti Madhava Reddy : ఎప్పుడో చనిపోయిన మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును నీడలా వెంటాడుతున్నాడు. ఆయన వలన చంద్రబాబు ఏపీ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశాడు. ఇంతకీ ఆయన పేరును ఎవరు ఏపీ అసెంబ్లీలో ప్రస్తావించారంటే..ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అధికార వైసీపీ పక్షాన్ని ఇరకాటంలో పెట్టాలని ప్రతిపక్ష టీడీపీ పావులు పన్నింది. ఈ క్రమంలోనే అధికార వైసీపీపై విమర్శలకు పూనుకుంది. స్వయంగా టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత అయిన చంద్రబాబు నాయుడు గంటలపాటు మాట్లాడి వైసీపీపై విమర్శలు చేయాలనుకున్నారు.
ఈ నేపథ్యంలోనే వ్యవసాయ రంగంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడారు. అనంతరం వైసీపీ ప్రజాప్రతినిధులు మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. అంబటి రాంబాబు మాట్లాడుతుండగా, బాబాయ్‌పై గొడ్డలి వేటు.. అరంగంట అంటూ వ్యాఖ్యానాలు టీడీపీ ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చాయి. అంతే.. అవి వ్యాఖ్యలు టీడీపీ అధినేత చంద్రబాబుకు రివర్స్ అటాక్ అయ్యాయి. టీడీపీ నేతలకు కౌంటర్ ఇస్తున్న క్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు బండారం గంటల కావాలో, అర గంట కావాలో., మాధవరెడ్డి గారి సంగతేంటో అని మాట్లాడారు. అవన్నీ మాట్లాడేందుకు ఇది సమయం కాదని వ్యంగంగా స్పందించారు.
Alimineti Madhava Reddy : బెడిసి కొట్టిన టీడీపీ వ్యూహం..!
అలా ప్రతిపక్ష నేత వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. నిజానికి మాధవరెడ్డి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. టీడీపీ భావినేత నారా లోకేశ్‌ను విమర్శిస్తున్న క్రమంలో వంశీ మాధవరెడ్డి పేరు ప్రస్తావించారు. అది కాస్తా ఈ రోజు చంద్రబాబును అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయించి.. కన్నీరు పెట్టే స్థితికి తీసుకొచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ ఎత్తుగడలు విఫలమవడమే కాదు… అసలు ఆ పార్టీ శ్రేణులే ఊహించని స్థాయిలో చంద్రబాబు నిర్ణయం ఉందనే టాక్ ఆ పార్టీ వర్గాల నుంచి వినబడుతోంది. అయితే, అసెంబ్లీలో జరిగిన ఘటనలపై చాలా మంది విచారం వ్యక్తం చేస్తున్నారు.