Alla Ramakrishna Reddy : సారీ.. ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈ సారీ నో చాన్స్?
Alla Ramakrishna Reddy : వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి త్వరలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టబోతున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ నేతలు ఎవరికి మినిస్టర్ చాన్స్ వస్తుందో.. అనే చర్చ చర్చించుకుంటున్నారు. కాగా, ఈ సారి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి వర్గంలో చోటు దక్కించడం లేదనే టాక్ వినబడుతోంది.వైసీపీ చీఫ్ జగన్మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి వర్గంలో చోటు లభించకపోవడానికి ఆయన సామాజిక వర్గమే కారణమని తెలుస్తోంది. మంగళగిరి శాసన సభ్యుడిగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు సామాజిక వర్గ సమీకరణాల రిత్యా మంత్రి వర్గంలో చోటు లభించడం లేదని టాక్ వినబడుతోంది.
ఈ రెండు జిల్లాల కాపు, కమ్మ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన నేతలను ఆల్రెడీ కేబినెట్‌లోకి తీసుకునేందుకు జగన్ ప్లాన్ చేసినట్లు వినికిడి. అయితే, ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని జగన్ గతంలో పేర్కొన్న నేపథ్యంలో ఈ సారి ఆళ్ల మినిస్టర్ అయిపోతారని ఆళ్ల వర్గీయులు అనుకుంటున్నారు. అయితే, ఈ సారి కూడా.. వైసీపీ అధిష్టానం నుంచి సారీ..అనే మాట వినబడుతున్నట్లు సమాచారం. అయితే, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ అభివృద్ధి కోసం సాయశక్తుల కృషి చేస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి మినిస్టర్ పదవి ఇవ్వాలని ఆళ్ల వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేస్తోరో లేదో తెలియనందున ఈ సారి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని అంటున్నారు.
Alla Ramakrishna Reddy : ఆళ్లకు అవకాశం ఇవ్వకపోవడానికి కారణాలివేనట..
ఇకపోతే ఆళ్ల రామకృష్ణరెడ్డి సోదరుడు రామిరెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఆళ్ల రామకృష్ణారెడ్డి 2019 ఎనికల్లో టీడీపీ భావినేత నారా లోకేశ్‌పైన గెలుపొందారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, ముస్తాఫాతో పాటు ఇతరుల పేర్లను వైసీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు వైసీపీ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. చూడాలి మరి.. చివరకు ఏమవుతుందో..