Allari Naresh | అల్ల‌రి న‌రేష్ ఆల్క‌హాల్ టీజ‌ర్ అదిరింది.. హిట్ కొట్టిన‌ట్టేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allari Naresh | అల్ల‌రి న‌రేష్ ఆల్క‌హాల్ టీజ‌ర్ అదిరింది.. హిట్ కొట్టిన‌ట్టేనా?

 Authored By sandeep | The Telugu News | Updated on :4 September 2025,12:07 pm

Allari Naresh | అల్ల‌రి న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ఆల్కహాల్. ఈ సినిమా మెహర్ రాజ్ దర్శకత్వం లో రూపొందుతుండా .. సితార ఎంటర్టైనమెంట్స్, శ్రీకర స్టూడీయోస్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌లపై నాగవంశీ, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్.

#image_title

హిట్ కొడ‌తాడా?

టీజ‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మందు తాగని వ్య‌క్తితో బ‌ల‌వంతంగా మందు తాగిపిస్తే.. ఆ త‌ర్వాత జరిగిన ప‌రిణామ‌లు ఏంటి అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతుందని టీజ‌ర్ ని చూస్తే అర్ధ‌మ‌వుతుంది. కామెడియ‌న్ స‌త్య‌తో పాటు రుహాని శర్మ, నిహారిక ఎన్ఎమ్ త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ల‌క్ష‌లు ల‌క్ష‌లు సంపాదిస్తావు కానీ మందు తాగ‌వు.. ఇంకా ఎందుకు నీ బ‌తుకు అని స‌త్య చెప్పే డైలాగ్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది. తాగుడికి సంపాద‌న‌కు లింకే ముంది’. ‘తాగితే ఆల్క‌హాల్ న‌న్ను కంట్రోల్ చేస్తుంది. అది నాకు న‌చ్చ‌దు.’ అని న‌రేశ్ చెప్పే డైలాగ్‌లు బాగున్నాయి. మొత్తంగా టీజ‌ర్ అదిరిపోయింది. టీజ‌ర్ చూస్తుంటే ఈ చిత్రం కామెడీ ప్ర‌ధానంగా ఉండ‌నున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

 

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది