Expensive Eggs : ప్రపంచంలోనే ఖరీదైన గుడ్లు ఇవి… ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు…!
Expensive Eggs : గుడ్డు మనందరికీ తెలుసు. కోడిగుడ్డు వలన మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనందరికీ తెలుసు. మన శరీరానికి ప్రోటీన్స్ అందించడంలో గుడ్డు బాగా సహాయపడుతుంది. అతి తక్కువ ధరలో మనకు ప్రోటీన్స్ అందించేది గుడ్డు. ప్రతిరోజు గుడ్డు తినడం వలన మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గుడ్డులో కాల్షియం, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ గుడ్లు మనకు అతి తక్కువ ధరలో లభిస్తాయి. కానీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన గుడ్లు కూడా ఉన్నాయి. వీటి ద్వారా తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇవి కోడిగుడ్లు కాదు. మరి ఆ గుడ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1) ఈము గుడ్లు అనేవి చూడడానికి చాలా పెద్దగా ఉంటాయి. దాదాపు 15 కోడిగుడ్లకు సమానం. ఈము గుడ్లతో ఆమ్లెట్ వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయట. ఒక్క ఈము గుడ్డులో చేసిన ఆమ్లెట్ ఒకటి తింటే, మన ఫుల్ భోజనం పూర్తయిపోతుంది. అంత పెద్దదిగా ఉంటుంది. రుచి కూడా బాగుంటుంది. రుచికి సైజుకి తగినట్లే దీని ధర కూడా అంతే ఉంటుంది. ఒక్క ఈము గుడ్డు ధర రూ.2000 దాకా ఉంటుంది.
2) గల్ గుడ్లు మన దగ్గర పెద్దగా లభించవు. ఇవి బ్రిటిష్ దేశంలో లభిస్తాయి. వీటి ధర చాలా ఎక్కువ. వీటికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా అరుదుగా కనిపిస్తాయి. సంవత్సరం మొత్తంలో కేవలం నాలుగు వారాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువ. వీటిని ఎక్కువగా ఉడకబెట్టుకొని తింటారు. ఒక్కో గుడ్డు ధర రూ.800 ఉంటుందట.
3) పిట్ట గుడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. మనం ఆడుకునే గోళీలు సైజులో ఉంటాయి. ఈ గుడ్లు చూడడానికి చిన్నగా ఉన్న ధర మాత్రం ఎక్కువగా ఉంటుంది. వీటి ధర డజన్ రూ.400 పైనే ఉంటుంది. ఇవి కొంచెం మన కోడిగుడ్ల లాగానే ఉంటాయి. వీటిని ఎక్కువగా ఉడకబెట్టుకొని తింటారు.
4) బాతు గుడ్లు అరుదుగా లభించేవి కావు. వీటి రుచి చాలా బాగుంటుంది. సాధారణ గుడ్ల కంటే ఎక్కువ ధర ఉంటుంది. బాతు గుడ్లు కోడిగుడ్ల కంటే పెద్దవి. ఎక్కువగా రైతు బజార్లలో కనిపిస్తాయి. సాధారణ గుడ్ల కంటే పోషకాలు, ప్రోటీన్లు ఎక్కువగా కలిగి ఉంటాయి.
5) టర్కీ గుడ్లు పెట్టడానికి వయసు పడుతుంది. కాబట్టి ఈ గుడ్లు చాలా అరుదుగా అమ్మబడుతాయి. టర్కీ గుడ్లు రుచికరమైనవి. చూడడానికి కోడిగుడ్లు లాగానే ఉంటాయి. కానీ ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. ఈ గుడ్లు ధర డజన్ 3 వేలకు పైగా ఉంటాయి.