Smart Phones : కేవలం రూ.999కే స్మార్ట్ ఫోన్… ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే…

 Authored By prabhas | The Telugu News | Updated on :27 August 2022,1:20 pm

Smart Phones : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఇది ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అన్ని పనులను స్మార్ట్ ఫోన్ ద్వారానే ఇంట్లో కూర్చొని చేసుకుంటున్నారు. ఉదాహరణకు ఫుడ్ డెలివరీ, షాపింగ్, కరెంట్ బిల్ పే చేయడం ఇలా ఎన్నో పనులను ఎక్కడున్నా సరే ఫోన్ ద్వారా చేసుకుంటున్నారు. అందుకనే మార్కెట్లోకి కొత్త కొత్త ఫోన్లు విడుదలవుతున్నాయి. టెక్నో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ Techno POVA 3 ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ 7000mAh బ్యాటరీ ని కలిగి ఉంది. ట్రావెలింగ్ చేసే వారికి ఈ ఫోన్ బాగా ఉపయోగపడుతుంది.

Techno POVA 3 ఫోన్ ను అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలు అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు వివిధ బ్యాంక్ ఆఫర్లు ఎక్స్చేంజ్ ఆఫర్లతో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. Techno POVA 3 యొక్క 4జీబీ, 64 జీబి స్టోరేజ్ వేరియంట్ ధర 14,999. అయితే రూ.2,800 తగ్గింపు తో 11 699కి కొనుగోలు చేయవచ్చు. కోటక్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేయడం ద్వారా 1500 ఆదా చేసుకోవచ్చు. ఇది కాకుండా స్టాండర్డ్ బ్యాంక్ కార్డులతో ఈఎంఐ లావాదేవీలపై రూ.1500 తగ్గింపు ఉంటుంది.

Amazon, Flipkart offers these smart phones buy only rs999.

Amazon, Flipkart offers these smart phones buy only rs999.

హెచ్ ఎస్ బి సి క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడం ద్వారా ఐదు శాతం తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఆఫర్ కింద 10,700 ఆదా చేసుకోవచ్చు. మీ మొబైల్ కండిషన్ బట్టి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది. ఈ విధంగా టెక్నో పోవా 3 ఫోన్ ఆఫర్లు రూ.999 ధరకే కొనుగోలు చేయవచ్చు. Techno POVA 3 స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రిష్ రేటుతో 6.9 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంది. ఫోన్లో Helio g88 గేమింగ్ ప్రాసెసర్ ఉంది. ఇక కెమెరా విషయానికొస్తే 50 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఎఫ్/2.0 ఎప్చర్ తో కెమెరా ఇవ్వబడింది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి