US Venezuela : వెనిజువెలా చమురు ఎగుమతులపై అమెరికా సంచలన నిర్ణయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

US Venezuela : వెనిజువెలా చమురు ఎగుమతులపై అమెరికా సంచలన నిర్ణయం

 Authored By ramu | The Telugu News | Updated on :8 January 2026,7:27 pm

ప్రధానాంశాలు:

  •  నిరవధికంగా వెనిజువెలా ఆయిల్ అమ్మకాలను నియంత్రించనున్న US

  •  చమురు రాజకీయాలు: అమెరికా–వెనిజువెలా మధ్య కొత్త మలుపు

US Venezuela : వెనిజువెలా Venezuela చమురు ఎగుమతులను నిరవధికంగా అమెరికా ఆపేస్తున్న‌ట్లు అమెరికా american  ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నిర్ణయం వెనిజువెలా ఆర్థిక వ్యవస్థతో పాటు అంతర్జాతీయ రాజకీయ రంగంలోనూ పెద్ద చర్చకు దారితీస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన దేశంగా వెనిజువెలా గుర్తింపు పొందింది. వెనిజువెలా నుంచి ఎగుమతి అయ్యే క్రూడ్ ఆయిల్ అమ్మకాలపై పూర్తిస్థాయి నిలిపివేయాల‌ని అమెరికా నిర్ణ‌యం తీసుకుంది . ఇప్పటికే నిల్వలో ఉన్న చమురును విక్రయించి, ఆ తర్వాత ఉత్పత్తి అయ్యే ప్రతి బారెల్‌ను కూడా అమెరికా పర్యవేక్షణలోనే అంతర్జాతీయ మార్కెట్‌కు పంప‌నున్నారు.

US Venezuela వెనిజువెలా చమురు ఎగుమతులపై అమెరికా సంచలన నిర్ణయం

US Venezuela : వెనిజువెలా చమురు ఎగుమతులపై అమెరికా సంచలన నిర్ణయం

US Venezuela : చమురు అమ్మకాలు అమెరికా పర్యవేక్షణలోనే

ఈ చర్య వెనిజువెలా అధ్యక్షుడు నికోలాస్ మడురో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా తీసుకున్నదిగా అమెరికా అధికారులు తెలిపారు . ఆయిల్‌ అమ్మకాల పై వచ్చే ఆదాయం నేరుగా వెనిజువెలా ప్రభుత్వానికి చేరకుండా అడ్డుకోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని చెప్పుతున్నారు . అమెరికా వాదన ప్రకారం, ఈ చమురు ఆదాయాన్ని భవిష్యత్తులో వెనిజువెలా ప్రజల సంక్షేమం కోసం వినియోగించే అవకాశాలు పరిశీలిస్తామని తెలిపింది. అయితే ఈ ఆదాయం ఎప్పుడు, ఎలా వినియోగించబడుతుందన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు.
వెనిజువెలా దేశం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ దేశ సార్వభౌమాధికారంపై ఇది ప్రత్యక్ష దాడిగా వెనిజువెలా ప్రభుత్వం అభివర్ణించింది. అంతర్జాతీయ చట్టాలకు వ్య‌తిరేకంగా అమెరికా వ్యవహరిస్తోందని ఆరోపించింది.

ఈ పరిణామం ప్ర‌పంచ ఇంద‌న‌ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపే అవకాశముంది. వెనిజువెలా చమురు సరఫరాలో మార్పులు వస్తే ఆయిల్‌ ధరల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, వెనిజువెలా చమురు ఎగుమతులపై అమెరికా నియంత్రణ నిర్ణయం కేవలం రెండు దేశాల మధ్య సమస్యగా కాకుండా, అంతర్జాతీయ రాజకీయాలు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశంగా మారింది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది