ananthapuram : సృష్టిలోని మానవ సంబంధాల్లో అతిముఖ్యమైన, అతి పవిత్రమైన బంధం ఏమిటంటే అది తల్లి బిడ్డల బంధం. ఎలాంటి స్వార్దాలకు తావులేని స్వచ్ఛమైన ప్రేమ, అలాంటి తల్లి బిడ్డలను విడతీసిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ జిల్లాకు చెందిన బుక్కపట్నం మండలం దూపంపల్లికి చెందిన వినయ అనే మహిళ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఆమెకు వెంకటరెడ్డి అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం పెళ్లయింది. ఓ బాబు కూడా పుట్టాడు. బాబు పుట్టినప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. డబ్బు తేవాలంటూ ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది.
అక్కడే ఉంటూ వర్క్ చేసుకుంటూ తన రెండేళ్ల బిడ్డను చూసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో కొద్దీ రోజుల కిత్రం ఆమె భర్త, అతని బంధువులు వినయ వాళ్ళ ఇంటికి వచ్చి, ఆమెతో గొడవపెట్టుకొని రెండేళ్ల బాబును బలవంతంగా తీసుకోని వెళ్లిపోయారు. దీనితో ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ‘నా బాబును నాకు ఇప్పించండి సార్. పాలు తాగే బిడ్డ సార్. తల్లి లేకుంటే ఉండలేడు. నా భర్త నా నుంచి బలవంతంగా లాక్కుని వెళ్లిపోయాడు. ప్లీజ్. దయచేసి నా రెండేళ్ల బాబును నాకు ఇప్పించండి‘ అంటూ ఆ తల్లి కాళ్లావేళ్లా పడ్డా పోలీసులు కనికరించలేదు. కనీసం కేసు కూడా తీసుకోలేదు. ఈ ఘటనపై డీఎస్పీ రమాకాంత్ కు ఫిర్యాదు చేసిన ఎలాంటి ఫలితం లేదు.
ఇక తాజాగా ఎస్పీ సత్యయేసు బాబు ఆద్వర్యంలో స్థానిక డీపీఓ ఆవరణలో పోలీస్ స్పందన కార్యక్రమం జరుగుతోందని ఆమెకు తెలిసింది. దీనితో ఆమె ఆ కార్యక్రమానికి వెళ్లి, తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొని తన బిడ్డను తిరిగి తనకు అప్పగించాలని వేడుకుంది. దీనితో స్పందించిన సత్యయేసు బాబు ‘నిబంధనల ప్రకారం ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలు తల్లి వద్దే ఉండాలి. అది ఎలాంటి వివాదానికి సంబంధించిన కేసయినా సరే చిన్న పిల్లలు మాత్రం తల్లివద్దే ఉండాలి. చివరకు ఏదైనా కేసులో తల్లి జైలుకు వెళ్లినా పిల్లలు కూడా తల్లి వెంటే ఉన్న ఉదంతాలు ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కూడా ఆమెకు బిడ్డను ఎందుకు తెచ్చి ఇవ్వలేదు. విచారణ సంగతి తర్వాత ముందు బిడ్డను తెచ్చి ఆమెకు ఇవ్వండి‘ అంటూ అప్పటికప్పుడే సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీచేశాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.