పాలు తాగే బిడ్డ కనికరం చూపించండి సర్.. పోలీసులతో ఒక తల్లి ఆవేదన.. అసలేం జరిగిందంటే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

పాలు తాగే బిడ్డ కనికరం చూపించండి సర్.. పోలీసులతో ఒక తల్లి ఆవేదన.. అసలేం జరిగిందంటే..

ananthapuram : సృష్టిలోని మానవ సంబంధాల్లో అతిముఖ్యమైన, అతి పవిత్రమైన బంధం ఏమిటంటే అది తల్లి బిడ్డల బంధం. ఎలాంటి స్వార్దాలకు తావులేని స్వచ్ఛమైన ప్రేమ, అలాంటి తల్లి బిడ్డలను విడతీసిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ జిల్లాకు చెందిన బుక్కపట్నం మండలం దూపంపల్లికి చెందిన వినయ అనే మహిళ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఆమెకు వెంకటరెడ్డి అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం పెళ్లయింది. ఓ బాబు కూడా పుట్టాడు. బాబు పుట్టినప్పటి […]

 Authored By brahma | The Telugu News | Updated on :23 March 2021,12:55 pm

ananthapuram : సృష్టిలోని మానవ సంబంధాల్లో అతిముఖ్యమైన, అతి పవిత్రమైన బంధం ఏమిటంటే అది తల్లి బిడ్డల బంధం. ఎలాంటి స్వార్దాలకు తావులేని స్వచ్ఛమైన ప్రేమ, అలాంటి తల్లి బిడ్డలను విడతీసిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ జిల్లాకు చెందిన బుక్కపట్నం మండలం దూపంపల్లికి చెందిన వినయ అనే మహిళ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఆమెకు వెంకటరెడ్డి అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం పెళ్లయింది. ఓ బాబు కూడా పుట్టాడు. బాబు పుట్టినప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. డబ్బు తేవాలంటూ ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది.

ananthapuram woman fighting for her two year old child

ananthapuram woman fighting for her two year old child

అక్కడే ఉంటూ వర్క్ చేసుకుంటూ తన రెండేళ్ల బిడ్డను చూసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో కొద్దీ రోజుల కిత్రం ఆమె భర్త, అతని బంధువులు వినయ వాళ్ళ ఇంటికి వచ్చి, ఆమెతో గొడవపెట్టుకొని రెండేళ్ల బాబును బలవంతంగా తీసుకోని వెళ్లిపోయారు. దీనితో ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ‘నా బాబును నాకు ఇప్పించండి సార్. పాలు తాగే బిడ్డ సార్. తల్లి లేకుంటే ఉండలేడు. నా భర్త నా నుంచి బలవంతంగా లాక్కుని వెళ్లిపోయాడు. ప్లీజ్. దయచేసి నా రెండేళ్ల బాబును నాకు ఇప్పించండి‘ అంటూ ఆ తల్లి కాళ్లావేళ్లా పడ్డా పోలీసులు కనికరించలేదు. కనీసం కేసు కూడా తీసుకోలేదు. ఈ ఘటనపై డీఎస్పీ రమాకాంత్ కు ఫిర్యాదు చేసిన ఎలాంటి ఫలితం లేదు.

ఇక తాజాగా ఎస్పీ సత్యయేసు బాబు ఆద్వర్యంలో స్థానిక డీపీఓ ఆవరణలో పోలీస్ స్పందన కార్యక్రమం జరుగుతోందని ఆమెకు తెలిసింది. దీనితో ఆమె ఆ కార్యక్రమానికి వెళ్లి, తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొని తన బిడ్డను తిరిగి తనకు అప్పగించాలని వేడుకుంది. దీనితో స్పందించిన సత్యయేసు బాబు ‘నిబంధనల ప్రకారం ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలు తల్లి వద్దే ఉండాలి. అది ఎలాంటి వివాదానికి సంబంధించిన కేసయినా సరే చిన్న పిల్లలు మాత్రం తల్లివద్దే ఉండాలి. చివరకు ఏదైనా కేసులో తల్లి జైలుకు వెళ్లినా పిల్లలు కూడా తల్లి వెంటే ఉన్న ఉదంతాలు ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కూడా ఆమెకు బిడ్డను ఎందుకు తెచ్చి ఇవ్వలేదు. విచారణ సంగతి తర్వాత ముందు బిడ్డను తెచ్చి ఆమెకు ఇవ్వండి‘ అంటూ అప్పటికప్పుడే సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీచేశాడు.

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది