#image_title
Anasuya | అనసూయ భరద్వాజ్ ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియా పోస్టులు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. లేటెస్టుగా మూడు కొత్త ప్రాజెక్ట్స్ కు సైన్ చేసినట్లు అనసూయ తెలిపింది. ఓ షాప్ ఓపెనింగ్ కోసం నందిగామలో సందడి చేసింది అనసూయ. ఈ సందర్భంగా ‘తల్వార్’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించింది. ”మూడు సినిమాలకు సైన్ చేశాను. అవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. పూరీ జగన్నాథ్ గారి అబ్బాయి ఆకాష్ పూరీ హీరోగా చేస్తున్న ‘తల్వార్’ మూవీలో నటిస్తున్నాను అని పేర్కొంది.
#image_title
బిజీ బిజీ..
ప్రస్తుతానికి టీవీ షోలు చేయడం లేదని చెప్పిన అనసూయ.. కుటుంబం మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలిపింది. ”నేను అందరిలాగే ఒక టీనేజర్ కి అమ్మని. అందుకే ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తున్నాను అని పేర్కొంది. ప్రేక్షకులకు దూరంగా ఉండకూడదని అప్పుడప్పుడు అడపాదడపా టీవీల్లో కనిపిస్తూ ఉంటాను. ‘బిగ్ బాస్’ తర్వాత ‘కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్’ కొత్త సీజన్ ఉంటుంది. దాంతో త్వరలోనే కలుద్దాం” అని అనసూయ చెప్పింది.
అయితే బిగ్ బాస్ ‘సీజన్-9లో పార్టిసిపేట్ చేస్తారా?’ అని అనసూయని ప్రశ్నించగా.. ”నేను బిగ్ బాస్ లోనా?” అంటూ ఎదురు ప్రశ్నించింది. ”ఆల్రెడీ ఒకటీ రెండుసార్లు దెబ్బలు పడతాయ్ రాజా అన్నందుకే ఫుల్ వైరల్ అయిపోయింది. బిగ్ బాస్ కి వెళ్తానని నేను అనుకోవడం లేదు. అయినా నేను నా ఫ్యామిలీకి దూరంగా ఉండను. ‘బిగ్ బాస్’లో ఉండలేను. కానీ ఆ షోలో పాల్గొనే వారందరికీ ఆల్ ది బెస్ట్” అని అనసూయ చెప్పుకొచ్చింది.
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
This website uses cookies.