Ys Jagan : ప్రతి ఇంటికి వెళ్లాలి.. ఎమ్మెల్యేలకువైఎస్ జగన్ దిశా నిర్ధేశం
Ys Jagan : ఆంధ్ర ప్రదేశ్ లో మరో రెండు సంవత్సరాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి వైకాపాని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ది కార్యక్రమాల కారణంగా తప్పకుండా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మకం లో వైకాపా నాయకులు వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికి ఎమ్మెల్యేలు వెళ్లాలి అంటూ ఆయన సూచించారు.
ఈ రెండేళ్ల సమయంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కనీసం రెండు సార్లు అయినా వెళ్లి వాళ్లని పలకరించాలని.. ప్రతి ఒక్కరి అవసరాన్ని తెలుసుకుంటూ వారికి కావలసిన పథకాలను గురించి తెలియజేస్తూ ప్రభుత్వం యొక్క పని తీరును అర్థమయ్యేలా వివరించాలి అంటూ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు.కార్యకర్తల సహాయంతో ప్రతి ఒక్క గ్రామంలోనే మరియు పట్టణంలోని ఇంటికి ఇంటికి వెళ్లి మరి ప్రభుత్వ పథకాలను మరియు అభివృద్ధిని గురించి వివరించాలంటూ ఎమ్మెల్యేలకు సూచించారు. వాలంటీర్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు గాను మరింతగా కృషి చేస్తామని వారికి హామీ ఇవ్వడంతో పాటు.. గ్రామాల్లో ఉన్న వాలంటీర్ల కు ప్రజల సమక్షంలో సన్మాన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఆదేశించారు.
నెలలో కనీసం పది నుండి పదిహేను సన్మాన కార్యక్రమాలు నిర్వహించి గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలను ఆ సన్మాన కార్యక్రమాలు చూసి అభివృద్ధి కార్యక్రమాలను వెల్లడించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలియజేశారు.రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విషయాల తో గ్రామ గ్రామాన ప్రచారం చేస్తే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో విజయం మనదే అంటూ జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు అలసత్వంతో వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో వారికి సీటు ఇచ్చేది లేదని, సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసి పక్కన పెట్టేసి కొత్త వారికి ఛాన్స్ ఇస్తామంటూ హెచ్చరించారు.