Police Recruitment : 10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు.. ఇప్పుడే అప్లై చేసుకోండి..!
ప్రధానాంశాలు:
Police Recruitment : 10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు.. ఇప్పుడే అప్లై చేసుకోండి..!
Police Recruitment : ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా చూస్తే సివిల్ పోలీస్, ఏపీఎస్పీ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పోస్టుల భర్తీకి ముందు ప్రిలిమినరీ పరీక్ష జనవరి 22న 2023 లో నిర్వహించారు. దీనిలో 459182 మంది అభ్యర్ధులు హాజరు కాగా అందులో 95208 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎస్.ఎల్.పి.ఆర్.బి నెక్స్ట్ దశలను పూర్తి చేసేందుకు తేదీలు ప్రకటించింది.
Police Recruitment పోస్టుల వివరాలు చూస్తే
పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) పురుషులు మరియు మహిళలకు, ఏపిఎస్పీ పురుషులకు ఖాళీలు ఉన్నాయి. ఇక ఖాళీల వివరాలు చూస్తే.. మొత్తం ఖాలీల వివరాలు అధికారిక వెబ్ సైట్ లో చూడొచ్చు. విద్యార్హతలు ఎలా అంటే.. అభ్యర్ధులు కనీసం 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాసి ఉండాలి. విద్యార్హతకు సంబందించి కూడా మరిన్ని విషయాలు నోటిఫికేషన్ లో చూడొచ్చు.
Police Recruitment కావాల్సిన డాక్యుమెంట్స్
ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్
విద్యార్హత సర్టిఫికెట్
కుల ధృవపత్రం
ఫిజికల్ టెస్ట్ వివరాలు
డిసెంబర్ లో ఫిజికల్ టెస్ట్ ఇంకా ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ లు నిర్వహిస్తారు. అభ్యర్ధులు పరీక్షల వివరాలకు కావాల్సిన డీటైల్స్ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.
అవసరమైన తేదీలు..
ఫిజికల్ టెస్ట్ దరఖాస్తు ప్రారంభ తేదీ నవంబర్ 11, 2024
ఫిజికల్ టెస్ట్ దరఖాస్తు చివరి తేదీ : నవంబర్ 21, 2024
పి.ఎం.టి/పి.ఈ.టి నిర్వహణ తేదీ : డిసెంబర్ చివరి వారంలో అది అధికారికంగా తెలియాల్సి ఉంది.
వీటి కోసం అభ్యర్ధులు ఎస్.ఎల్.పి.ఆర్.బి వెబ్ సైట్ లో అప్డేట్స్ ని చూస్తూ ఉండాలి. అప్లికేషన్ ఫారం సబ్మిట్ చేయాలి.