AP Pension | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం .. దివ్యాంగుల పెన్షన్లకు రీ-అసెస్‌మెంట్ ప్రక్రియ ప్రారంభం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Pension | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం .. దివ్యాంగుల పెన్షన్లకు రీ-అసెస్‌మెంట్ ప్రక్రియ ప్రారంభం

 Authored By sandeep | The Telugu News | Updated on :8 October 2025,6:00 pm

AP Pension | ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీం కింద దివ్యాంగులకు పెన్షన్లు అందజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, గతంలో వివిధ కారణాలతో పెన్షన్లు రద్దయినవారికి లేదా పెన్షన్ రకం మారినవారికి మరోసారి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం రీ అసెస్‌మెంట్ ప్రక్రియను ప్రారంభిస్తోంది.

#image_title

రీ-వెరిఫికేషన్ అవసరం

ఈ నెల అక్టోబర్ 8వ తేదీ (బుధవారం) నుంచి మూడు రోజులపాటు (బుధ, గురు, శుక్రవారాలు) రాష్ట్రవ్యాప్తంగా రీ-అసెస్‌మెంట్ టెస్టులు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో అర్హులుగా తేలినవారికే నవంబర్ నెల నుంచి పెన్షన్ అందుతుంది. గతంలో నోటీసులు అందుకుని అప్పీల్ చేసిన దివ్యాంగులకు ఇది మరో అవకాశం.

పెన్షన్ మొత్తం ఎంత?

85% కంటే పైబడిన వైకల్యం ఉన్నవారికి – రూ.15,000

40%–85% మధ్య వైకల్యం ఉన్నవారికి – రూ.6,000

40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి – రూ.4,000

పరీక్షలు ఎలా జరుగుతాయి?

పెన్షన్ కోసం అప్పీల్ చేసిన లబ్ధిదారులకు:

తేదీ, ఆసుపత్రి సమాచారం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ద్వారా అందించబడుతుంది.

సచివాలయాల వారీగా తేదీలు కేటాయించబడతాయి.

రీ అసెస్‌మెంట్‌కు ఎంపీడీవోలు, డీసీహెచ్ఎస్, మెడికల్ సూపరింటెండెంట్లు సమన్వయంతో ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

అర్హతను నిర్ధారించిన తర్వాత కొత్త సర్టిఫికెట్‌ జారీ అవుతుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది