Banks Merge | ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల విలీనం .. ఖాతాదారులకు ముందస్తు హెచ్చరిక | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Banks Merge | ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల విలీనం .. ఖాతాదారులకు ముందస్తు హెచ్చరిక

 Authored By sandeep | The Telugu News | Updated on :9 October 2025,2:30 pm

Banks Merge | కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ నెమ్మదిగా అమలు అవుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ప్రధాన గ్రామీణ బ్యాంకులు –

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు

చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్

ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్

సప్తగిరి గ్రామీణ బ్యాంక్ – ఇన్నీ విలీనం అయి ఒక్కటే బ్యాంకుగా ‘ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు’గా ఏర్పడనున్నాయి.

సాంకేతిక విలీన ప్రక్రియ: 5 రోజుల సేవలకు విఘాతం

#image_title

ఈ విలీనానికి సంబంధించి బ్యాంక్ తాజాగా ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది. అందులో భాగంగా అక్టోబర్ 9 (బుధవారం) సాయంత్రం 6 గంటల నుండి అక్టోబర్ 13 (ఆదివారం) ఉదయం 10 గంటల వరకు పలు బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు పేర్కొంది.

ఈ సేవలు లభించవు:

మొబైల్ బ్యాంకింగ్

ఇంటర్నెట్ బ్యాంకింగ్

యూపీఐ / ఐఎంపీఎస్

ఏటీఎం లావాదేవీలు

బ్యాంక్ మిత్ర సేవలు

బ్రాంచ్ ఆధారిత బ్యాంకింగ్ (వారాంతపు సెలవులతో కలిపి)

అక్టోబర్ 11 (శనివారం), అక్టోబర్ 12 (ఆదివారం) బ్యాంక్ సెలవులుగా ఉన్నప్పటికీ, ఆన్‌లైన్ సేవలు కూడా అందుబాటులో ఉండవు.

దీనివల్ల మొత్తం 5 రోజులపాటు ఈ గ్రామీణ బ్యాంకుల ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది