
Ys Jagan is going on a tour of Visakhapatnam again
Ys Jagan : ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు ఆలోచన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మెదడు పొరల్లోంచి వచ్చిందే. దేశంలో ఎవరి బుర్రకు తట్టని అద్భుతమైన ఆలోచన అది. ఈ విధానాన్ని తమ రాష్ట్రంలో కూడా అమలుచేస్తే బాగుండునని చాలా రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే జగన్ మార్కు పాలనకు అద్దం పట్టేలా ఏపీలో గ్రామ, వార్డు సచివాలాయాలు ఉన్నాయి. ఈ గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షల్లో ఉద్యోగాలు కూడా ఇచ్చారు. అందుకే అప్పట్లో అది ఒక ఉద్యోగ విప్లవంగా కూడా చర్చల్లోకి వచ్చింది. కానీ, అలాంటి సచివాలయాల్లో ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది.
ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్‌ల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. జగన్ సారూ మా బాధలకు కారణం మీరే అంటూ ఈ మధ్యే ఒక వాలంటీర్ లేఖ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనే కాదు విజయనగరం జిల్లాలో ఒకరు, సీమ జిల్లాలో ఇంకొకరు ఇలా వరసగా ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. అయితే, వారి ఆత్మహత్యలకు చెప్పుకోలేని ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. మరి గ్రామ సచివాలయాల్లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలను వైసీపీ సర్కారు పట్టించుకుంటుందా అన్నదే ప్రశ్నార్థకంగా ఉంది. సీఎం జగన్ ఎంతో ప్రతిష్ఠాత్మంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు ఇప్పుడు జగన్‌నే ఎందుకు దోషిని చేస్తున్నాయో తెలియాల్సి ఉంది.
నిజానికి సచివాలయంలో అయిదు వేల రూపాయల జీతం తీసుకునే వాలంటీర్ల చేత గొడ్డు చాకిరీ చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంతేగాక వాలంటీర్‌లను సేవకులుగానే చూస్తాం తప్ప ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబోమని ప్రభుత్వం పేర్కొనడం కూడా వారిలో నిరుత్సాహానికి కారణమైందని చెప్పవచ్చు. గ్రామ సచివాలయాల్లో వాలంటీర్ల పరిస్థితి ఇలా ఉంటే.. ఇక సచివాలయాలలో పనిచేసే సెక్రటరీలు, అడ్మిన్ ఇతర ఉద్యోగులకు గత రెండు నెలలుగా జీతాలు లేవు. వారు ఈ ఉద్యోగాల్లో చేరినప్పుడు రెండేండ్ల తర్వాత రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఇపుడేమో పరీక్షలు పాస్ కావాలంటున్నారు. ఇది తమను మనోవేదనకు గురిచేస్తుందని వారు చెబుతున్నారు.
ys jagan
ఒకవైపు గ్రామ సచివాలయాల్లో వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులు కాదంటున్నారు. మరోవైపు వారికి ఇచ్చేది తక్కువ జీతం. ఆ జీతంలో కూడా సెలవు పెడితే శాలరీ కట్. ఇన్ని బాధలతో ఉద్యోగాలు చేస్తున్నా వారు ప్రభుత్వ పథకాలకు అర్హులు కారట. వారి నుంచి బలవంతంగా తెల్ల రేషన్ కార్డులను లాగేసుకుంటున్నారు. వారికి ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు కాకుండా చూస్తున్నారు. ఇది వారి ఆవేదనను రెట్టింపు చేస్తున్నది. అటు ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఇటు ప్రభుత్వ పథకాలు రావు.. ఏం బతుకురా బాబు అంటూ ఆందోళన చెందుతున్నారు.
జగన్ సర్కారు మరోవైపు ఏపీలో లక్షల మంది పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తామని చెబుతున్నది. కానీ గ్రామ సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు మాత్రం ఆ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కారట. అంటే వారి పరిస్థితి మొత్తానికి త్రిశంకు స్వర్గంలా మారింది అన్నమాట. ఇక వారు ఉద్యోగాలలో చేరినప్పుడు మరెక్కడికీ వెళ్లబోమని ప్రమాణ పత్రాలపైన రాయించుకున్నారు. దాంతో తాము బయటికి వెళ్లే పరిస్థితి లేక.. బయటికి వెళ్లిన తర్వాత ఏజ్ బార్ అయిపోయి బయట కూడా అవకాశాలు లేక తంటాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సీఎం జగన్ ఒక మంచి ఆశయంతో స్థాపించి గ్రామ సచివాలయ వ్యవస్థ ఇప్పుడు అందులో పనిచేసే ఉద్యోగులు, వాలంటీర్ల పాలిట అవస్థగా మారిపోయింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.