Karthika Deepam 31 Aug Today Episode : నేను బతికే ఉన్నా.. అనే విషయం ఏసీపీకి చెబితే.. నీ ఫ్యామిలీలో ఒక్కరు కూడా మిగలరు.. అంటూ కార్తీక్ ను బెదిరించిన మోనిత

Karthika Deepam 31 Aug Today Episode : కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ 31 ఆగస్టు 2021, మంగళవారం రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1132 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ ను బెడ్ కు కట్టేసిన మోనిత.. నన్ను చంపేయాలనిపిస్తోందా? అరిచి అందరినీ పిలవాలని ఉందా? మాట్లాడకుండా చేశాను. కార్తీక్.. నా కార్తీక్.. ఎలా ఉండేవాడివి.. ఎలా అయిపోయావు కార్తీక్.. నీ మీద నాకున్న ప్రేమ.. నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది కార్తీక్. అయ్యో… ఎందుకు నాకు నీమీద ఎనలేని ప్రేమ కలగాలి. నిన్నే పెళ్లి చేసుకోవాలని.. నీ బిడ్డను కనాలని నాకు అనిపించింది. పాపాత్మురాలు మోనిత. కానీ.. పాపం వెనుక ఉన్నది ప్రేమ.. అని అంటుంది మోనిత.

karthika deepam 31 august 2021 tuesday 1132 Full episode

నువ్వంటే పిచ్చి ప్రేమ కార్తీక్. నీ పేరు జపిస్తూ నిన్నే స్మరిస్తూ.. 16 ఏళ్లుగా పెంచుకున్న ప్రేమను తుంచుకోలేక చివరకు నేను చచ్చిపోయినట్టు ప్రపంచాన్ని నమ్మించాల్సి వచ్చింది. దాని వల్ల నువ్వు జైలుపాలు అవుతావని తెలిసినా తప్పలేదు. దాచుకొని ఉంటే నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. అందుకే.. ఇక్కడికి వచ్చేలా చేశాను. ఎందుకు అనుకున్నావు. నిన్ను నేను మాత్రమే కాపాడగలను.. అని చెప్పడానికి.. అని మోనిత కార్తీక్ తో చెబుతుంది.

 

karthika deepam 31 august 2021 tuesday 1132 Full episode

Karthika Deepam 31 Aug Today Episode : నువ్వు నా మెడలో తాళి కట్టు కార్తీక్.. అన్న మోనిత

 

మోనిత మేడమ్ బయటికి వచ్చాక.. దీప గుర్తుపడితే ఎలా? అని రత్నసీత బయట ఉండి తెగ టెన్షన్ పడుతుంది. నేను పోలీసులకు లొంగిపోతాను కార్తీక్. అప్పుడు నువ్వు బయటికి వస్తావు కానీ.. ఒక్క షరతు.. ఆ షరతు ఏంటంటే.. మీతో దీపా ఉంటుంది. మీ కవల పిల్లలు ఉంటారు. కానీ.. నేనూ ఉంటాను. మనమంతా కలిసి వసుదైక కుటుంబంలా ఉందాం. కానీ.. ఒక షరతు.. నువ్వు నా మెడలో తాళి కట్టాలి.. అంటుంది మోనిత.

karthika deepam 31 august 2021 tuesday 1132 Full episode

షాక్ అయ్యావా? ఇంతకు మించి నీకు ఇంకో దారిలేదు. నువ్వు లేని జీవితం నాకు వద్దు కార్తీక్. పిచ్చి దాన్ని అయ్యాను కార్తీక్. 16 ఏళ్ల నుంచి ఈ గుండెల్లో నిన్ను దాచుకొని.. నువ్వు దీపను పెళ్లి చేసుకుంటే.. ఆమెతో సంతోషంగా కాపురం చేసుకుంటుంటే.. పరాయిదానిలా.. ఉత్త స్నేహితురాలిరా.. నా హద్దుల్లో నేను ఉండాల్సి వచ్చింది. ఆ నరకాన్ని ఇన్ని రోజులు భరించాను. ఇక భరించడం నా వల్ల కాదు. అందుకే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావనుకో.. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి.. ఏమంటావు.. అని అంటుంది మోనిత.

Karthika Deepam 31 Aug Today Episode : నన్ను పెళ్లి చేసుకో.. నేను పోలీసులకు లొంగిపోతాను.. అని చెప్పిన మోనిత

karthika deepam 31 august 2021 tuesday 1132 Full episode

 

ఈ ప్లాస్టర్ లేకుండా ఉండి ఉంటే.. నన్ను బండ బూతులు తిట్టేవాడివి కదా. చేతులు కట్టేసి ఉండకపోతే.. నా పీక పిసికి ఉండేవాడివి కదా. వద్దు కార్తీక్. నేనేమంటున్నాను. ప్రేమించమంటున్నాను. నా ప్రేమను అందుకునే అవకాశాన్ని నీకు ఇస్తున్నాను. నా లాంటి అందగత్తె నీకు బోనస్ గా దక్కుతుంది కార్తీక్. తెలివిగా ఆలోచించు. నేను ఈ దాగులు మూతలు అన్నీ ఆపేస్తాను. పోలీసులకు లొంగిపోతాను. మహా.. అయితే రెండు మూడేళ్లు జైలు శిక్ష పడుతుంది. బయటికి రాగానే కలిసి బతుకుదాం. నా బిడ్డ.. నిన్ను నాన్నా అనాలి. నన్ను అమ్మ అనాలి. చాలు ఈ జీవితానికి.. అని అంటుంది మోనిత.

karthika deepam 31 august 2021 tuesday 1132 Full episode

ఈ కుట్రలు, కుతంత్రాలు అన్నీ మానేస్తాను. దీపను అడ్డు తొలగించుకోవాలని కూడా ఆలోచించను. ఎంత మంచిదాన్ని కార్తీక్. నిన్ను జైలు పాలు కాకుండా కాపాడి.. నీ బదులు నేను జైలుకు వెళ్లడానికి కూడా ఆలోచించండం లేదంటే.. ఈ ప్రపంచంలో నా అంత గొప్ప ప్రేమికురాలు ఉండదేమో. ఒకవేళ నా ప్రపోజల్ ఒప్పుకోకపోతే.. ఏసీపీకి నాగురించి చెప్పాలని చూస్తే.. అంటూ గన్ తీసి కంగారు పడకు… నిన్ను చంపితే నా బతుకే వేస్ట్. నిన్ను చంపను.. నేను చస్తా. నేనే కాల్చుకొని చచ్చిపోతాను.. అంటూ బెదిరిస్తుంది మోనిత.

Karthika Deepam 31 Aug Today Episode : మీ అమ్మ రివాల్వర్ లోని రెండో బుల్లెట్ కూడా నాదగ్గరే ఉంది

karthika deepam 31 august 2021 tuesday 1132 Full episode

మీ అమ్మ రివాల్వర్ నుంచి దొంగలించిన రెండు బుల్లెట్లలో ఒకటి పోలీసుల దగ్గర ఉంది.. రెండోది నా డెడ్ బాడీలో లేదు… ఈ రివాల్వర్ లో ఉంది.. అని చెబుతుంది మోనిత. నువ్వు నన్ను షూట్ చేసి.. అప్పుడే నన్ను చంపినట్టు ఉంటుంది. ఇది పోస్ట్ మార్టమ్ రిపోర్ట్. ఇందులో డేట్ రాయకుండా ఖాళీగా ఉంచాను. నేను ఆనాడే చనిపోయినట్టు ఇందులో అఫిషియల్ గా ఉంటుంది.చనన్ను చంపిన నేరం ఈసారి సాక్ష్యాలతో సహా రుజువు అవుతుంది. నువ్వు శాశ్వతంగా జైలులో ఉంటావు. నా బంగారం జైలులో ఉంటే.. నా ఆత్మ శాంతించదు కార్తీక్. నువ్వు బయటే ఉండాలి.. నీతో నేను ఉండాలి. అందరూ ఉండాలి. అందులో నేను ఉండాలి.

karthika deepam 31 august 2021 tuesday 1132 Full episode

 

ఇప్పుడు నీ చేతి కట్లు విప్పేస్తాను. నువ్వు నన్ను పట్టుకోవాలని చూసినా.. పోలీసులకు అప్పజెప్పాలని చూసినా.. ఇంకేం చేసినా.. మీ ఇంటి గార్డెన్ లో కూర్చున్న మీ అమ్మా నాన్నలను ఓ అపరిచితుడు షూట్ చేస్తాడు. నీకోసమే కూర్చొని ఏడుస్తున్న నీ భార్యను ఇంకో అపరిచితుడు షూట్ చేస్తాడు. నీ పిల్లలు కూడా అంతే.. అంటూ బెదిరిస్తుంది మోనిత.

karthika deepam 31 august 2021 tuesday 1132 Full episode

నువ్వు నా పెళ్లి ప్రపోజల్ ను ఒప్పుకోకపోతే.. కొన్నాళ్లు నేను.. దాక్కొనే ఉంటాను.. నీ ఇంట్లోని ఒక్కొక్కరిని చంపేస్తాను. చచ్చిపోయిన మోనితే చంపింది అన్నా కూడా ఎవ్వరూ వినరు. నువ్వు తెలివైన వాడివి కార్తీక్. నీ కుటుంబం బాగుండాలి. నన్ను, నా బిడ్డను నీ కుటుంబంలో కలుపుకోవాలి.. అంటూ చెప్పి కట్లు విప్పేస్తుంది మోనిత. మళ్లీ నేను రేపు వస్తాను. నీ నిర్ణయం చెప్పు. లవ్యూ డియర్.. అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత.

Karthika Deepam 31 Aug Today Episode : మోనితను చూసిన దీప..

మోనిత బయటికి వచ్చి చూసేసరికి.. దీప కనబడుతుంది. దీంతో మోనిత షాక్ అవుతుంది. ఇంతలో దీప తనను చూసి దగ్గరికి వెళ్లి.. డాక్టర్ ఆయనకు ఎలా ఉంది.. అని అడుగుతుంది. నువ్వు ఆయన భార్యవా? అని అడుగుతుంది. ఫుడ్ పాయిజన్ అయింది. పర్వాలేదు అని చెప్పి.. వెళ్లి నీ భర్తను చూడండి.. అని చెబుతుంది మోనిత.

karthika deepam 31 august 2021 tuesday 1132 Full episode

కట్ చేస్తే.. దీప.. డాక్టర్ బాబును చూడటానికి వస్తుంది. దీప.. నువ్వు బాగానే ఉన్నావా? ఇక్కడికి ఎందుకు వచ్చావు. ఎప్పుడు వచ్చావు.. అని అడుగుతాడు. వెంటనే తనను కౌగిలించుకుంటాడు. ఏమైంది డాక్టర్ బాబు. ఏమైంది.. ఎందుకు అలా ఉన్నారు.. అని అడుగుతుంది.అసలు.. ఏం జరిగిందో తెలుసా? అని ఏదో చెప్పబోతూ.. మళ్లీ ఆగిపోతాడు కార్తీక్. తన ఇంట్లో వాళ్లను మోనిత చంపేస్తుందేమోనని భయపడి.. మోనిత గురించి చెప్పకుండా ఆగిపోతాడు కార్తీక్.

 

karthika deepam 31 august 2021 tuesday 1132 Full episode

Karthika Deepam 31 Aug Today Episode : దీపకు మోనిత గురించి చెప్పాలా వద్దా అని టెన్షన్ పడ్డ కార్తీక్

నేను పిచ్చిదాన్నే హడావుడిగా మీకు ఏది పడుతుందో.. ఏది ఫుడ్ ఎలర్జీ అవుతుందో తెలియకుండా.. వంట చేశాను. అంతా నావల్లే. నా వల్లే.. అని అంటుంది. నీ వల్ల కాదులే.. అంతకు ముందే ఏదో తిన్నా. అదే ఎఫెక్ట్ అయింది.. అని చెబుతాడు కార్తీక్. సరే.. మీరు రెస్ట్ తీసుకోండి. పడుకోండి. నేను ఇక్కడే ఉంటాను.. ఇంటికి వెళ్లను.. పడుకోండి.. అని చెబుతుంది దీప.

karthika deepam 31 august 2021 tuesday 1132 Full episode

 

దీపకు మోనిత గురించి చెప్పాలా? వద్దా? అని తెగ ఆలోచిస్తుంటాడు కార్తీక్. కానీ.. చెబితే ఎక్కడ తనను చంపేస్తుందని భయపడి తన గురించి చెప్పడు. తను అన్న మాటలే గుర్తు తెచ్చుకుంటూ తెగ టెన్షన్ పడిపోతాడు కార్తీక్. ఉలిక్కిపడుతుంటాడు. దీప.. నువ్వు ఇక్కడెందుకు ఉన్నావు. ఇంటికి వెళ్లిపో.. అని చెబుతాడు. దీంతో డాక్టర్ బాబు.. మానసికంగా డిస్టర్బ్ అయినట్టున్నాడు. ఏం జరిగింది అసలు.. అని బాధపడుతుంది దీప. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే.. తదుపరి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.

 

karthika deepam 31 august 2021 tuesday 1132 Full episode

 

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

1 week ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

1 week ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

1 week ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

1 week ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

1 week ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

2 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

2 weeks ago