Pawan kalyan : పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాళ్ళు కూడా కల నెరవేర్చుకుంటారట..!

Authored By vamana sai | The Telugu News | Updated on : 21 April 2021, 12:19 pm

Pawan kalyan : పవన్ కళ్యాణ్ సినిమా చేయాలంటే చేస్తాడు..లేదంటే లేదు. కానీ మాటిచ్చాడంటే మాత్రం ఆ నిర్మాతకి ఖచ్చితంగా సినిమా చేస్తాడు. ఇటీవల దిల్ రాజు ఇందుకు పెద్ద ఉదాహరణ. దిల్ రాజుకి పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలన్నది 22 ఏళ్ళ కల. ఆ కల వకీల్ సాబ్ సినిమాతో తీరింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్ ఘన విజయాన్ని అందుకుంది. సుప్రీం కోర్ట్ కూడా ఈ సినిమాని.. లాయర్ పాత్రలో కనిపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని.. వకీల్ సాబ్ చిత్ర బృందాన్ని అభినందించారు.

another-producer-is-waiting-for-pawan-kalyan

another-producer-is-waiting-for-pawan-kalyan

సామాజిక అంశం.. సమాజంలో ఆడపిల్లల పట్ల జరుగుతున్న సమస్యలను కళ్ళకు కట్టినట్టుగా చూపించిన దర్శకుడు టాలెంట్‌కి పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న హరిహర వీరమల్లు సినిమాని కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడో కమిటయ్యాడు. ఆ మాట తప్పకుండా నిర్మాతకి హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Pawan kalyan : పవన్ కళ్యాణ్‌తో జె.బి. ఎంటర్‌టైన్మెంట్స్..!

కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాతలు భగవాన్, పుల్లారావు ఒక సినిమా చేయాలని సిద్దంగా ఉన్నారు. కథ కూడా రెడీగా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా సినిమా చేస్తానని చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ నిర్మాతలు మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్‌తో రిపబ్లిక్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా పోస్ట్‌పోన్ చేయబోతున్నారు. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కమిటయిన సినిమాలు కంప్లీట్ అవగానే జె.బి.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై జె.పుల్లారావు, భగవాన్ భారీ బడ్జెట్‌తో సినిమా ప్లాన్ చేస్తారట. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ అఫీషియల్‌గా ఎప్పుడు అనౌన్స్ మెంట్ వస్తుందో.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి