YS Jagan : జగన్ ప్రభుత్వానికి అతిపెద్ద గెలుపు – జగన్ జీవితంలో చాలా గొప్ప రిలీఫ్ ఇది..!
YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. సంవత్సరం పైనే సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఎన్నికల్లో గెలుపు కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో నూటికి నూరు శాతం అంటే 175 సీట్లు గెలుచుకోవాలని ఆరాటపడుతున్న సీఎం జగన్ కు ఎన్నికల వేళ గుడ్ న్యూస్ అందింది. మరో గెలుపు దక్కింది. అసలు ప్రభుత్వంపై ఉద్యోగుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనే ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో మంచి సమాధానం దొరికింది జగన్ కు.
మరోసారి అమరావతి కేంద్రంగా రాష్ట్ర మద్దతుదారుడిగా ఉన్న నాయకుడినే ఉద్యోగులు గెలిపించారు. ఏపీ సచివాలయం సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డిని ఎన్నుకున్నారు. వెంకట్రామిరెడ్డి మొదటి నుంచి ఏపీ ప్రభుత్వానికి మద్దతుగానే ఉన్నారు. అసలే ఉద్యోగులు ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు అనే వార్తలు వినవొస్తున్న ఈనేపథ్యంలో ఈసారి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అని ఏపీ ప్రభుత్వం కాస్త టెన్షన్ పడిన మాట వాస్తవమే. కానీ.. ఉద్యోగులు మాత్రం ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న వెంకట్రామిరెడ్డినే గెలిపించి వైసీపీ పార్టీకి మళ్లీ ఊపిరి పోసినంత పని చేశారు. ఏపీ సచివాలయ సంఘం(అప్సా) అధ్యక్షుడిగా రెండోసారి వెంకట్రామిరెడ్డి కొనసాగనున్నారు.
YS Jagan : రెండోసారి ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడిగా గెలిచిన వెంకట్రామిరెడ్డి
మొత్తం సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్ లో ఉన్న 1225 మంది ఉద్యోగుల్లో.. 1162 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో.. వెంకట్రామిరెడ్డికి 720 ఓట్లు రాగా.. రామకృష్ణకు 432 ఓట్లు వచ్చాయి. దీంతో వెంకట్రామిరెడ్డి 228 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నిజానికి ఇది కేవలం సచివాలయానికి సంబంధించిన ఎన్నికే అయినా.. ఇది వచ్చే ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. సచివాలయం ఉద్యోగుల మూడ్ ను ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. చూద్దాం మరి ఈ ఎన్నికల ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏవిధంగా పడుతుందో?