AP BJP : ఉత్తరాంధ్రలో నిఖార్సయిన బీజేపీ నాయకుడే లేడా? ఆ లోటును ఎందుకు భర్తీ చేయలేకపోతోంది బీజేపీ?

విశాఖ : బీజేపీకి అత్యంత కీల‌క‌మైన ఉత్తరాంధ్రలోని విశాఖ‌ప‌ట్నం జిల్లాలో కీల‌క నేత‌.. కంభం పాటి హ‌రిబాబు ఇటీవ‌ల మిజోరం రాష్ట్ర గ‌వ‌ర్నర్‌గా ప్రమోష‌న్‌పై వెళ్లిపోయారు. దీంతో ఇప్పటికి ఉన్న నేత‌ల్లో ఎమ్మెల్సీ మాధ‌వ్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నా.. ఈయ‌న‌కు పోటీగా కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వరి కూడా దూకుడు చూపిస్తార‌ని అంటున్నారు. గ‌తంలో ఇక్కడ నుంచి పోటీ చేసి ఎంపీగా కూడా గెలిచిన ఆమె గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. అయితే.. ఇప్పటి వ‌ర‌కు హ‌రిబాబు ప్రభావం ఉంద‌ని.. అందుకే కొంద‌రు నేత‌లు పుంజుకోలేక పోతున్నారనే వాద‌న వినిపించేది. కానీ, ఇప్పుడు హ‌రిబాబు బీజేపీకి దూర‌మ‌య్యారు.

BJP

దీంతో ఇప్పుడు కీల‌క‌మైన విశాఖ రాజ‌కీయాల్లో ప‌ట్టు సాధించేది ఎవ‌రు? అనే ప్రశ్న తెర‌మీదికి వ‌చ్చింది. ఇటీవ‌ల ఎమ్మెల్సీ మాధవ్ ఉత్తరాంధ్ర జిల్లాలో గాంధీ సంక‌ల్ప యాత్ర పేరిట స‌మ‌స్యలు తెలుసుకునే ప్రయ‌త్నం చేశారు. దీనిపై పెద్దగా ఫోక‌స్ రాక‌పోయినా.. ఆయ‌న మాత్రం విశాఖ‌పై ప‌ట్టు బిగించేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న స‌మ‌స్యలు ప‌రిష్కరించేందుకు కృషి చేస్తున్నాన‌ని ఆయ‌న చెబుతున్నారు.

పురందేశ్వరికి.. AP BJP

కానీ, విశాఖ‌పై ప‌ట్టు సాధించాలంటే.. కీల‌క‌మైన రెండు పార్టీలు.. వైసీపీ, టీడీపీల‌ను బ‌లంగా ఎదుర్కొనాల్సిన అవ‌స‌రం ఉంటుంద‌ని.. పైగా పారిశ్రామికంగా , సామాజిక వ‌ర్గం ప‌రంగా కూడా ప‌ట్టు సాధించాల్సి ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. మాధ‌వ్ ఈ త‌ర‌హా రాజ‌కీయం చేసే ప‌రిస్థితి లేద‌ని.. కుండ‌బ‌ద్దలు కొడుతున్నారు. ఏదైనా ఉంటే.. పురందేశ్వరి వంటి బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం అండ‌దండ‌లు ఉన్న నాయ‌కురాలు వ‌స్తే.. బాగానేఉంటుంద‌ని అంటున్నారు. అయితే.. ఆమె రాక‌ను ఇక్కడి బీజేపీ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

purandeswari

ఎక్కడో ప్రకాశం జిల్లాకు చెందిన ఆమె గ‌తంలో కాంగ్రెస్ నుంచి ఇక్కడ ఎంపీ అవ్వడంతో పాటు కేంద్ర మంత్రి అయ్యి పెత్తనం చేశారు. ఇప్పుడు బీజేపీలో కూడా ఆమెకు ఇక్కడ ప్రధాన బాధ్యత‌లు ఇస్తే ఇక్కడే పాత‌ుకుపోయి త‌మ‌పై పెత్తనం చేస్తార‌ని.. స్థానికేత‌రురాల‌ని.. అంత‌ర్గత ప్రచారం చేస్తున్నారు. దీంతో విశాఖ‌పై ప‌ట్టు సాధించ‌డం బీజేపీ నేత‌లు క‌త్తిమీద సాముగా మారింద‌ని అంటున్నారు. ఏదేమైనా విశాఖ బీజేపీకి ఇప్పుడు అర్జెంటుగా ఓ లీడ‌ర్ అయితే కావాల్సి ఉంది. మ‌రి ఈ లోటును ఎవ‌రు భ‌ర్తీ చేస్తారో ? చూడాలి

Recent Posts

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

10 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

12 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

16 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

19 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

22 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

1 day ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

2 days ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

2 days ago