రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యం.. సీఎం జగన్
జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ సీఎం కాకముందు నుంచి కూడా ఒకేమాట చెబుతూ వస్తున్నారు. తాను అధికారంలో ఉన్నా లేకున్నా.. ఎప్పుడూ రైతుల గురించే ఆలోచిస్తానని.. తాను రైతు పక్షపాతినని స్పష్టంగా చెబుతారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా సీఎం జగన్.. అదే చెబుతున్నారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
అందుకే… రైతుల ఆదాయం రెట్టింపు చేయడం కోసం రైతులకు 99 శాతం పంట రుణాలు ఇచ్చినట్టు సీఎం జగన్ స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ మీటింగ్ లో పాల్గొన్న సీఎం… రైతులను ఎలా ఆదుకోవాలి.. వాళ్ల ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేయాలి.. అనే దానిపై మంత్రులతో చర్చించారు.
రైతు భరోసా కింద ప్రతి రైతుకు 13,500 చెల్లిస్తున్నామని… పెట్టబడి వ్యయం తగ్గించి.. రైతుకు పెద్దపీట వేస్తున్నట్టు జగన్ స్పష్టం చేశారు.
10,461 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. కౌలు రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు కూడా సిద్ధంగా ఉండాలి. వాళ్లకు కూడా రుణాలు ఇవ్వాలి. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారస్తులకు 10 వేలు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.