YS Jagan : జగన్ కు నిమ్మగడ్డ షాకిస్తే.. నిమ్మగడ్డకు జగన్ ఏం రేంజ్ ట్విస్ట్ ఇచ్చారో తెలుసా?
ఏపీలో ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది ఇన్నిరోజులు. ఏపీ ప్రభుత్వం, ఏపీ ఎన్నికల కమిషన్ మధ్య జరిగిన యుద్ధం మామూల్ది కాదు. చివరకు ఆ యుద్ధంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమారే గెలిచినట్టు. ఎందుకంటే.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెప్పినట్టుగానే ఏపీలో పంచాయతీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లినా ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది.
సుప్రీం కోర్టు చెప్పాక చేసేదేం ఉంటుంది. అందుకే.. ఏపీ ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సై అన్నది. ఉద్యోగులు కూడా ఎన్నికలకు సహకరిస్తామని ఎస్ఈసీకి తెలిపారు. అలాగే… ఎన్నికల నిర్వహణకు.. అధికారులంతా సహకరించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ కూడా ఆదేశించారు.
అంతవరకు బాగానే ఉంది. మొత్తం మీద నిమ్మగడ్డ కోరుకున్నట్టే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి కానీ.. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. నిమ్మగడ్డ.. ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ కు షాకిస్తే.. రివర్స్ లో జగన్.. ఇప్పుడు నిమ్మగడ్డకు షాకిచ్చారు.
పంచాయతీల ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు
ప్రస్తుతం జరగనున్నది పంచాయతీ ఎన్నికలు. ఒకవేళ గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయితే .. ఆ ఊళ్లో ఎన్నికలు నిర్వహించడం ఏం ఉండదు. అందుకే.. నిమ్మగడ్డను నిలువరించడానికి ఏపీ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. మాగ్జిమం కుదిరినన్ని పంచాయతీల్లో ఏకగ్రీవాలు అయ్యేలా చూడాలని సీఎం జగన్.. నేతలకు సూచించారట. అలాగే.. ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధమయ్యారు. పంచాయతీలు ఏకగ్రీవం అయితే.. ఆ పంచాయతీకి ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది. ఆ ప్రోత్సాహకాలతో తమ ఊరిని బాగు చేసుకోవచ్చు.
ఏకగ్రీవం అయితే.. 2 వేల లోపు జనాభా ఉన్న ఊరికి 5 లక్షల ప్రోత్సాహకాన్ని అందించనుంది ప్రభుత్వం. అలాగే.. 2 నుంచి 5 వేల లోపు జనాభా ఉంటే 10 లక్షలు, 5 వేల నుంచి 10 వేల లోపు ఉంటే 15 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందించనుంది. ఒకవేళ 15 వేల జనాభా దాటితే మాత్రం 20 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందించనుంది.