YS Jagan : మొహమాటం లేకుండా జగన్ ని ట్రోల్ చేస్తున్న జగన్ వీరాభిమానులు?
YS Jagan : సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక అధికారంలోకి వచ్చిన కొత్తలో జగన్ చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు ఇలా పలు అంశాలు అప్పట్లో చాలా కీలకమైనవిగా ఉన్నాయి. అందుకే.. తన పార్టీని 25 పార్లమెంట్ స్థానాల్లో గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచి అయినా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తానని వైఎస్ జగన్ 2019 ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు.
ఏది ఏమైనా.. వైసీపీకి 2019 ఎన్నికల్లో 22 లోక్ సభ స్థానాలు వచ్చాయి. 22 మంది వైసీపీ ఎంపీలు గెలిచారు. దీంతో రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలపై ముఖ్యంగా ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ముఖ్యమంత్రిగా జగన్ నిలదీస్తారని అందరూ భావించారు. అందుకే.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్ ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోదీతో సహా.. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్య నేతలను జగన్ కలిశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశారు.
YS Jagan : ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై వెనక్కి తగ్గిన జగన్
సీఎం అయిన తర్వాత కేంద్రంతో మాట్లాడిన జగన్.. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చిందని, ఈ సమయంలో ప్రత్యేక హోదా కోసం వాళ్లను రిక్వెస్ట్ చేయడం తప్పితే కేంద్రాన్ని నిలదీసే పరిస్థితి లేదని మీడియాతో చెప్పారు. జగన్ మాటలు విని ఏపీ మొత్తం షాక్ అయిపోయింది. కట్ చేస్తే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో జగన్ నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరించారు.
తాజాగా మళ్లీ ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు లాంటి అంశాలు తెరమీదికి వచ్చాయి. సోమవారం సీఎం జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం నిధుల సాధనే లక్ష్యంగా ప్రధాని మోదీతో జగన్ భేటీ కానున్నారు. విభజన చట్టంలోని పలు పెండింగ్ అంశాలను కూడా వెంటనే పరిష్కరించాలని ప్రధానిని జగన్ కోరనున్నాట్టు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. మరి.. భేటీ తర్వాత ఏపీ విషయంలో జగన్ ఎలా వ్యవహరిస్తారో.. ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే మరొక రోజు వేచి చూడాల్సిందే.