YS Jagan : గ్రామ వాలంటీర్లకి వైఎస్ జగన్ అద్భుతమైన బంపర్ ఆఫర్..!!
YS Jagan : ప్రస్తుతం దేశమంతా ఏపీ వైపు చూస్తోంది. దానికి కారణం.. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ. అవును.. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎప్పుడైతే గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారో.. అసలైన లబ్ధిదారులకే సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయి. అసలు ఏ రాష్ట్రం కూడా ఇప్పటి వరకు గ్రామ వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాలేదు. అందుకే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థను ప్రతిపక్షాలు సైతం మెచ్చుకొంటున్నాయి.
అయితే.. తాజాగా భూమి లేని గ్రామ వాలంటీర్ల కుటుంబాలకు నెలకు కొంత పెన్షన్ ఇచ్చే సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారు. అమరావతి ప్రాంతానికి చెందిన భూమి లేని గ్రామ వాలంటీర్లకు నెలకు రూ.2500 పెన్షన్ మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించిన ప్రకటనను మున్సిపల్ శాఖ విడుదల చేసింది.
YS Jagan : మార్చి 1 నుంచి గ్రామ వాలంటీర్లకు ఈ పెన్షన్ పథకం అమలు
ఇది ఒక పెన్షన్ పథకం. వాళ్లకు నెలనెలా పెన్షన్ లా రూ.2500 ను అందిస్తారు. అమరావతికి చెందిన గ్రామ వాలంటీర్లకే పెన్షన్ ఇవ్వడానికి కారణం.. అక్కడ పని చేస్తున్న వాలంటీర్లు నిరుపేదలు. అందుకే.. వాళ్ల కోసం సీఎం జగన్ ఈ పథకాన్ని తీసుకొచ్చారు. నిజానికి.. ఈ విషయం సీఎం జగన్ కు పురపాలక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి చెప్పారు. ఆమె సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్లకు పెన్షన్ ఇవ్వడానికి సీఎం జగన్ ఒప్పుకున్నారు.