Ys Jagan : వైఎస్ జగన్ విదేశీ పర్యటన.. తమ్ముళ్లు ఇదెక్కడి న్యాయం?
Ys Jagan : ఒక ముఖ్యమంత్రి సొంత పనుల మీద విదేశాలకు వెళ్ల కూడదు అంటూ ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టడం ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండదు. ఇది కేవలం తెలుగు రాష్ట్రం ఆంద్ర ప్రదేశ్ లో మాత్రమే జరుగుతుంది అంటూ వైపాకా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ తన కూతురు డిగ్రీ పట్టా పుచ్చుకుంటూ ఉంటే చూసేందుకు వెళ్తాను అంటే మొదట సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వలేదు. మళ్లీ కోర్టు లో అప్పీ లు చేసే అప్పుడు అనుమతులు వచ్చాయి. ఈ విషయం పై తెలుగు దేశం పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. జగన్ కేసు ఇప్పటి వరకు విచారణ మాత్రమే జరుగుతుంది.
ఒక కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఏ ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆ వ్యక్తిని దోషి అన్నట్లుగా చూడవచ్చు. విచారణ లో ఏం తేలుతుందో నిర్ధారణ అయ్యే వరకు నింధితుడిగానే ఉంటాడు. ఈవిషయాన్ని తెలుగు తమ్ముళ్లు మర్చి పోయినట్లుగా ఉన్నారు. అందుకే వారు దోషి గా జగన్ ను చూపిస్తూ వారి ఎల్లో మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతూ విదేశీ పర్యటన అనుమతి విషయంలో మాట్లాడుతూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ వైకాపా నాయకులు తీవ్ర స్థాయి లో ద్వజమెత్తుతున్నారు. పది రోజుల పాటు జగన్ విదేశీ పర్యటనకు వెళ్లినంత మాత్రాన ఆ కేసు మొత్తం తారు మారు అయినట్లుగా తెలుగు తమ్ముళ్లు కంగారు పడుతున్నారు.
సీబీఐ విచారణ కు ఆ పది రోజుల సమయంలో కూడా ఎలాంటి అడ్డు లేకుండా సాఫీగానే విచారణ జరిగేలా జగన్ తరపు న్యాయ వాదులు ఏర్పాటు చేశారు. అయినా కూడా ఎందుకు ఇప్పుడు జగన్ ను విదేశీ పర్యటనకు వెళ్లకుండా తెలుగు దేశం పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా తన కొడుకు మరియు కోడలు విదేశాల్లో చదువుకుంటున్న సమయంలో అక్కడ జరిగిన కార్యక్రమాలకు వెళ్లాడు. అప్పుడు ఈ నాయకులు అంతా ఎక్కడ ఉన్నారంటూ వైకాపా మాజీ మంత్రి ఒకరు తీవ్ర స్థాయిలో స్పందించారు.