YS Jagan : తిరుగులేని కొత్త స్ట్రాటజీతో రంగంలోకి దిగిన వైఎస్ జగన్ !
YS Jagan : 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏపీలో చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. నిజానికి వైసీపీ పాలన ఇప్పటి వరకు జరిగింది 4 ఏళ్లే. వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి. వచ్చే సంవత్సరం ఎన్నికలకు వెళ్లి ప్రజలను ఓట్లు అడగాలంటే ఇప్పటి వరకు ఏం చేశామో అన్నీ ప్రజలకు చెప్పాలి కదా. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీని ఏ విధంగా అభివృద్ధి చేసింది. ఏపీలో బడుగు, బలహీన వర్గాలకు ఎలాంటి ప్రయోజనం చేకూరింది అనేది ప్రజలకు ప్రభుత్వం చెప్పాలి కదా. ఇన్ని రోజులు వైసీపీ చేసింది ఇదే.
రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో విధంగా, ఏదో ఒక సంక్షేమ పథకం రూపంలో లబ్ధి చేకూరుతోందని వైసీపీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. గడప గడపకు ప్రభుత్వం పేరుతో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లి ఆ ఇంట్లో ఉన్న సమస్యలను కనుక్కొని, ప్రభుత్వం పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకుంటున్నారు. అంతే కాదు.. గతంలో అంటే గత ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాయి. ఇప్పుడు తమ ప్రభుత్వం ఏం చేస్తోంది అనే దానిపై సీఎం జగన్ ఇప్పుడు ఫోకస్ పెట్టారు.
YS Jagan : గత ప్రభుత్వాలకు లింక్ పెట్టడంతో ఇబ్బంది పడుతున్న ప్రతిపక్షాలు
గత ప్రభుత్వాలు ఏం చేశాయి.. ఇప్పుడు తాము ఏం చేశాం అనే విషయాన్ని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చేసరికి.. ప్రతిపక్షాలు బిత్తరపోతున్నాయి. ఎందుకంటే.. ఇదివరకు ఉన్న ప్రభుత్వాల్లో టీడీపీ కూడా ఉంది. ఏపీలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం టీడీపీనే. సీఎం జగన్ గత ప్రభుత్వాలు చేసింది ఇదే.. అంటూ ఏపీ ప్రజలకు స్పష్టం చేస్తుండటంతో ప్రజలు కూడా వైసీపీ గత ప్రభుత్వాల కంటే ఎక్కువే చేసిందని తెలుసుకుంటారు. దాని వల్ల వైసీపీకి ప్లస్ అవుతుంది. ప్రతిపక్ష పార్టీలకు మైనస్ అవుతుంది. ఎన్నికల వేళ సీఎం జగన్ భలేగా రూట్ మార్చారు. చూద్దాం ఇది ఏమేరకు వర్కవుట్ అవుతుందో.