YS Jagan : జగన్ నయా ఫార్ములా.. అందుకోసమేనా.?
YS Jagan : ప్రస్తుతం ఏపీ ప్రభుత్వమే కాదు.. అందరి చూపు విశాఖ వైపే ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్.. విశాఖ రాజధాని గురించి ఏ ప్రకటన చేస్తారా అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నిజానికి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 ప్రారంభం అయింది. దీని కోసం ఏపీ ప్రభుత్వం అన్ని సిద్ధం చేస్తోంది. ఈ సమ్మిట్ లో 26 దేశాల నుంచి 8 వేల మంది ప్రముఖులు హాజరుకానున్నారు. చాలామంది ప్రముఖులు ఈ సదస్సుకి హాజరుకానున్న నేపథ్యంలో ఏపీకి కనీసం రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను తేవాలని
ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సీఎం జగన్ ఈ సదస్సు కోసం వైజాగ్ వచ్చారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే.. ఈ సదస్సులో ఖచ్చితంగా ఏపీలో ఉన్న వనరులు, ఇతర అవకాశాలను పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ వివరించే అవకాశం ఉంది. ఈ సదస్సు ఉదయమే ప్రారంభం అయింది. బడా పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. సీఎం జగన్ ఈ సదస్సులో కీలక ప్రసంగం చేశారు.
YS Jagan : ఉదయం 9.45 కి ప్రారంభమైన సదస్సు
ఏపీలో పెట్టుబడులు పెట్టే విషయంపై, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం జగన్.. పారిశ్రామికవేత్తలకు వివరించారు. ప్రభుత్వ విధానాలను స్పష్టం చేశారు. సదస్సుకు వైజాగ్ కు విచ్చేసిన పారిశ్రామిక వేత్తలకు ఏపీ ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేసింది. వాళ్లంతా ప్రత్యేక విమానాల్లో వైజాగ్ కు చేరుకున్నారు. వైజాగ్ లో స్టార్ హోటల్స్ లో వాళ్లకు బస ఏర్పాటు చేశారు. ఇక.. రెండో రోజు సదస్సులో పెట్టుబడిపై ఒప్పందాలు జరుగుతాయి. ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం తరుపున పారిశ్రామిక వేత్తలు అందరికీ విందు ఇవ్వనున్నారు.