YS Jagan : అది వైఎస్ జగన్ అంటే.. అన్నంత పని చేసేశాడు.. షాక్ లో ప్రతిపక్షాలు?
YS Jagan : చాలామంది ఏపీ సీఎం వైఎస్ జగన్ ను లైట్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అయితే జగన్ ఏం చెప్పినా పెద్దగా నమ్మడం లేదు. మూడు రాజధానుల విషయంలో ఇప్పటికీ ఏదీ కార్యరూపం దాల్చలేదని వైఎస్ జగన్ ఏం చెప్పినా కాదని అనుకున్నారు కొందరు. అసలు ఏపీలో ఒక్క రాజధానికే దిక్కు లేదు. కానీ.. మూడు రాజధానులు ఏంటి.. అది అమలు అయ్యే చాన్స్ ఉందా.. వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం చేసే జిమ్మిక్కులు అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.
నిజానికి మూడు రాజధానుల అంశంపై సీఎం జగన్ చాలా సీరియస్ గానే ఉన్నారు. కానీ.. ఆ అంశానికి న్యాయ పరమైన చిక్కులు వస్తున్నాయి. దీంతో చివరకు సుప్రీం తలుపులు కూడా తట్టింది ఏపీ ప్రభుత్వం. ఏది ఏమైనా వైజాగ్ లో ముందు పరిపాలన రాజధానిని అమలు చేయాలని సీఎం జగన్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ వ్యూహాలపై మంత్రులతో చర్చించబోతున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి.. వైజాగ్ కు సీఎం క్యాంపు కార్యాలయాన్ని తరలించడం. రెండోది సీఎంగా అక్కడికి వెళ్లి అక్కడి నుంచే అంటే వైజాగ్ నుంచే పాలన సాగించడం.
YS Jagan : సీఎం జగనే వైజాగ్ లో ఉండి పాలన సాగిస్తారా?
ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా సీఎం జగన్ అక్కడికి వెళ్తే పాలన అక్కడి నుంచే మొదలు కానుంది. మరోవైపు సుప్రీంకోర్టులో మూడు రాజధానుల అంశంపై ఇంకా విచారణ ప్రారంభం కాలేదు. సుప్రీంలో ఒక్కసారి విచారణ ప్రారంభం కాగానే.. మంత్రి వర్గ భేటీ నిర్వహించి అప్పుడే సీఎం జగన్ ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. త్వరలో వైజాగ్ నుంచి పరిపాలన సాగే అవకాశం ఉందని జగన్ దూకుడు చూస్తేనే తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.