Amma Vodi Scheme : ఆంద్రప్రదేశ్ సమాచార సాంకేతిక శాఖ, ప్రసారాల శాఖ అంటూ కొందరు తప్పుడు ప్రెస్ నోట్ ను మీడియాకు విడుదల చేశారు. అందులో 2022 ఏడాదికి గాను జగనన్న అమ్మ ఒడి మరియు వాహన మిత్ర రెండు సంక్షే పథకాల కోసం ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా రద్దు చేయడం జరిగింది. కాబట్టి 2022 సంవత్సరంకు గాను లబ్ది దారులు అమ్మ ఒడి మరియు వాహన మిత్ర వర్తించదని గుర్తించగలరు అంటూ నోట్ లో పేర్కొన్నారు. ఈ పత్రిక ప్రకటన సోషల్ మీడియాలో ఒక్కసారి వైరల్ అవ్వడంతో లబ్ది దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం నుండి ఆ ప్రకటనకు క్లారిటీ వచ్చింది. సాంకేతిక ప్రసారాల శాఖ అనేది అసలు మనుగడలో లేదు.
ఇలాంటి ఫేక్ ప్రకటనలు పుట్టిస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామంటూ కమిషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అందులో అమ్మ ఒడి మరియు వాహన మిత్ర పథకాలకు సంబంధించి ఎలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేవు అంటూ క్లారిటీ ఇచ్చారు. పూర్తిగా అవాస్తవ కథనం అంటూ పేర్కొన్నారు.సమాచార, సాంకేతిక, ప్రసారాల శాఖ అనే తప్పుడు పేరుతో ఇలాంటి ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నించడం దారుణం. దీని వెనుక ఎంతటి వారున్నప్పటికి ఉపేక్షించేది లేదని, ఇటువంటి ఫేక్ వార్తలను, పుకార్లను పుట్టించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం.
జరుగుతుందని కమిషనర్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. సంక్షేమ క్యాలెండర్ ను ముందుగానే ప్రకటించి మరీ ఏ నెలకు ఆ నెల సంక్షేమ పథకాల లబ్ధిని డైరెక్ట్ గా లబ్ధిదారుల ఖాతాల్లో జమజేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్న దుష్ప్రచారాన్ని, అవాస్తవాలను ప్రజలెవరూ నమ్మొద్దని విజ్జప్తి చేశారు. కరోనా ఆర్థిక ఇబ్బందుల్లో కూడా సంక్షేమ పథకాల అమలు జరిగిందని, ప్రజలకు లబ్ధి చేకూర్చే ఏ సంక్షేమ పథకం ఆగదని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తరపున ఆ ప్రకటనలో తెలిపారు.
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
This website uses cookies.