Amma Vodi Scheme : ఫ్యాక్ట్‌ చెక్‌.. అమ్మ ఒడి, వాహనమిత్ర రద్దు తప్పుడు ప్రచారం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Amma Vodi Scheme : ఫ్యాక్ట్‌ చెక్‌.. అమ్మ ఒడి, వాహనమిత్ర రద్దు తప్పుడు ప్రచారం

 Authored By prabhas | The Telugu News | Updated on :1 June 2022,3:30 pm

Amma Vodi Scheme : ఆంద్రప్రదేశ్‌ సమాచార సాంకేతిక శాఖ, ప్రసారాల శాఖ అంటూ కొందరు తప్పుడు ప్రెస్ నోట్‌ ను మీడియాకు విడుదల చేశారు. అందులో 2022 ఏడాదికి గాను జగనన్న అమ్మ ఒడి మరియు వాహన మిత్ర రెండు సంక్షే పథకాల కోసం ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా రద్దు చేయడం జరిగింది. కాబట్టి 2022 సంవత్సరంకు గాను లబ్ది దారులు అమ్మ ఒడి మరియు వాహన మిత్ర వర్తించదని గుర్తించగలరు అంటూ నోట్‌ లో పేర్కొన్నారు. ఈ పత్రిక ప్రకటన సోషల్‌ మీడియాలో ఒక్కసారి వైరల్‌ అవ్వడంతో లబ్ది దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం నుండి ఆ ప్రకటనకు క్లారిటీ వచ్చింది. సాంకేతిక ప్రసారాల శాఖ అనేది అసలు మనుగడలో లేదు.

ఇలాంటి ఫేక్ ప్రకటనలు పుట్టిస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామంటూ కమిషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అందులో అమ్మ ఒడి మరియు వాహన మిత్ర పథకాలకు సంబంధించి ఎలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేవు అంటూ క్లారిటీ ఇచ్చారు. పూర్తిగా అవాస్తవ కథనం అంటూ పేర్కొన్నారు.సమాచార, సాంకేతిక, ప్రసారాల శాఖ అనే తప్పుడు పేరుతో ఇలాంటి ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నించడం దారుణం. దీని వెనుక ఎంతటి వారున్నప్పటికి ఉపేక్షించేది లేదని, ఇటువంటి ఫేక్ వార్తలను, పుకార్లను పుట్టించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం.

జరుగుతుందని కమిషనర్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. సంక్షేమ క్యాలెండర్ ను ముందుగానే ప్రకటించి మరీ ఏ నెలకు ఆ నెల సంక్షేమ పథకాల లబ్ధిని డైరెక్ట్ గా లబ్ధిదారుల ఖాతాల్లో జమజేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్న దుష్ప్రచారాన్ని, అవాస్తవాలను ప్రజలెవరూ నమ్మొద్దని విజ్జప్తి చేశారు. కరోనా ఆర్థిక ఇబ్బందుల్లో కూడా సంక్షేమ పథకాల అమలు జరిగిందని, ప్రజలకు లబ్ధి చేకూర్చే ఏ సంక్షేమ పథకం ఆగదని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తరపున ఆ ప్రకటనలో తెలిపారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది