Good News : గర్భిణీలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ వైద్య సేవలు ఫ్రీ ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Good News : గర్భిణీలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ వైద్య సేవలు ఫ్రీ ..!!

Good News : ఏపీ ప్రభుత్వం కాబోయే తల్లులకు గుడ్ న్యూస్ చెప్పింది. పేద వారికి, ఆర్థికంగా వెనకబడిన వారికి సంక్షేమ పథకాలను అందిస్తుంది. ఇప్పటికే గర్భిణీలకు బాలింతలకు సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ కింద సరుకులను అందిస్తుంది. అయితే జులై 1 నుంచి సరుకులను నేరుగా వారి ఇంటికే సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం అంగన్వాడి కేంద్రాల్లో అందిస్తున్న సరుకులను జులై నుంచి నేరుగా బాలింతలు, గర్భిణీల ఇంటికి వెళ్ళనున్నాయి. బియ్యం, […]

 Authored By prabhas | The Telugu News | Updated on :15 May 2023,9:00 am

Good News : ఏపీ ప్రభుత్వం కాబోయే తల్లులకు గుడ్ న్యూస్ చెప్పింది. పేద వారికి, ఆర్థికంగా వెనకబడిన వారికి సంక్షేమ పథకాలను అందిస్తుంది. ఇప్పటికే గర్భిణీలకు బాలింతలకు సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ కింద సరుకులను అందిస్తుంది. అయితే జులై 1 నుంచి సరుకులను నేరుగా వారి ఇంటికే సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం అంగన్వాడి కేంద్రాల్లో అందిస్తున్న సరుకులను జులై నుంచి నేరుగా బాలింతలు, గర్భిణీల ఇంటికి వెళ్ళనున్నాయి. బియ్యం, కందిపప్పు, పాలు, గుడ్లు, నూనె, అటుకులు, బెల్లం, ఎండు ఖర్జూరం వంటి సరుకులు పంపిస్తున్నారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం గర్భిణీలకు ఆ వైద్య సేవలను ఉచితంగా అందిస్తుంది.

AP government has given good news to expectant mothers

AP government has given good news to expectant mothers

గర్భిణీల కోసం ఉచితంగా అత్యాధునిక టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలిస్ టిఫా స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. గర్భిణీలు 18 నుంచి 22 వారాల దశలో టిఫా స్కానింగ్ చేయించుకోమని వైద్యులు చెబుతున్నారు. తల్లి గర్భంలో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని పిండం ఎదుగుదలలో ఏమైనా లోపాలు ఉంటే గుర్తించడం ఉపయోగపడుతుంది. ఈ స్కానింగ్ చేసి ఏమైనా సమస్యలు ఉంటే వైద్యులు గర్భిణీలకు సూచనలు చేస్తారు. ఈ స్కానింగ్ కి 1100 ఖర్చు అవుతుంది. అయితే దీనిని ప్రభుత్వమే భరిస్తుంది. అలానే అల్ట్రా సోనోగ్రామ్ స్కానింగ్ కి 250 చొప్పున ప్రభుత్వం పెట్టుకుంటుంది.

ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. ఇక నుండి గర్భిణీలకు ఆ సేవలు ఉచితం - Good news  from the government. From now on, those services are free for pregnant women

ఆరోగ్యశ్రీ సదుపాయం ఉన్న ఆసుపత్రులలో ఈ టిఫా స్కానింగ్ ఉచితంగా నిర్వహిస్తారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న పేద, మధ్యతరగతి గర్భిణీలు ఒక టిఫా స్కానింగ్, రెండు అల్ట్రా సోనోగ్రామ్ స్కానింగ్ లు ఫ్రీగా చేస్తారు. గతేడాది ఆరోగ్యశ్రీ కార్డు కింద 2.31 లక్షల మంది గర్భిణీలు ప్రసవ సేవలు పొందారు. టిఫా, ఆల్ట్రా సోలోగ్రామ్ స్కానింగ్ చేయడానికి అవసరమైన విధానాలను ఆన్లైన్లో పొందుపరిచినట్లు ఆరోగ్యశ్రీ అధికారులు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వస్తున్న ఈ సేవలను గర్భిణీ స్త్రీలు ఆన్లైన్లో నమోదు చేసుకొని వినియోగించుకోవాలని అన్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది