AP DSC 2024 : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఐదు నెలలు అవుతున్న సందర్భంగా వారి మానిఫెస్ట్ లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో దీపావళి కి ఉచిత సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే దీనికి సంబందించిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇక ఇప్పుడు మరో కీలక హామీ కూడా నెరవేర్చే దిశగా కసరత్తు జరుగుతుందని తెలుస్తుంది. ఏపీలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే యువత ఉద్యోగాల నోటిఫ్కేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మెగా డీఎస్సీతో పాటుగా ఇతర శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చూస్తున్నారు.
కూటమి అధికారం లోని రాగానే సీఎం చంద్రబాబు మెగా డీఎసీ 2024 ఫైల్ మీద సంతకం చేశారు. ఈ క్రమంలో టెట్ పరీక్ష జరిగింది. వీటి ఫలితాలు త్వరలో రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. నవంబర్ 6న ఉపాధ్యాయ భర్తీ నోటిఫికేషన్ వస్తుందని తెలుస్తుంది. ఇది ఉద్యోగార్ధుల కోసం మంచి శుభవార్త అని చెప్పొచ్చు.
డీఎస్సీకి టెట్ ద్వారా క్వాలిఫై అవ్వాలి.. ఐతే ఈ నేపథ్యంలో టెట్ నిర్వహించగా దానికి సంబందించిన ఫలితాలు నవంబర్ 2న రిలీజ్ చేసేలా విద్యా శాఖ ఫిక్స్ అయ్యింది. టెట్ ఫలితాలు వచ్చిన నెక్స్ట్ డేనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేలా మొదట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐతే 3వ తేదీన ఆదివారం అవ్వడంతో 6న నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 16347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
రోస్టర్ వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. నోటిఫికేషన్ వచ్చిన 4 నెలల్లోనే నియామకాలు జరిగేలా చేయాలని చూస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వచ్చే వేసవిలో పోస్టింగ్ ఇచ్చి నెక్స్ట్ అకడమిక్ ఇయర్ కి విధుల్లో జాయిన్ అయ్యేలా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం మెగా డీఎస్సీలో మొత్తం 16347 పోస్టులు ఉన్నాయి. ఇనులో ఎస్జీటీ పోస్టులు 6371 కాగా స్కూల్ అసిస్టెంట్ లు 7725 ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1781 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 286 ప్రిన్సిపాల్ 52 పీ.ఈ.టీలు 132 ఉద్యోగాలు ఫిల్ చేయనున్నారు.
Kiran Abbavaram : యంగ్ అండ్ టాలెండ్ హీరో కిరణ్ అబ్బవరం వైవిధ్యమైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగే…
AP Government Credit : ఏపీలో అధికారం లోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమ పరిపాలన విషయంలో ప్రజల దృష్టిలో…
Diwali Gifts : ముఖేష్ అంబాని Mukesh Ambani దీపావళి Diwali సందర్భంగా రిలయన్స్ ఎంప్లాయీస్ కి సర్ ప్రైజ్…
పీఎం ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం జి.ఏ.వై) కింద ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య ఇంకా…
OIls Costlier Price hike : నిత్యావసరాల ధరలు మండిపోతున్న ఈ టైం లో ఒకదానికి మరొకటి అన్నట్టుగా రేట్లు…
Green Beans : సాధారణంగా మనం ప్రతిరోజు ఎన్నో రకాల కూరగాయలను తీసుకుంటూ ఉంటాం. అయితే ఒక్కొక్క కూరగాయలలో ఒక్కో రకమైన…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ పెట్టే ఫిటింగ్‌లు ఊహాజనితం. అప్పటి వరకు ఎంతో క్లోజ్‌గా ఉండేవారి…
Legs : మన శరీరంలో ఎటువంటి మార్పులు వచ్చినా మరియు ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఎటాక్ చేసినా ముందుగా వాటి…
This website uses cookies.