AP DSC 2024 : ఏపీలో మెగా డీఎస్సీ.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

AP DSC 2024 : ఏపీలో మెగా డీఎస్సీ.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!

AP DSC 2024 : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఐదు నెలలు అవుతున్న సందర్భంగా వారి మానిఫెస్ట్ లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో దీపావళి కి ఉచిత సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే దీనికి సంబందించిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇక ఇప్పుడు మరో కీలక హామీ కూడా నెరవేర్చే దిశగా కసరత్తు జరుగుతుందని తెలుస్తుంది. ఏపీలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే యువత ఉద్యోగాల నోటిఫ్కేషన్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :30 October 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  AP DSC 2024 : ఏపీలో మెగా డీఎస్సీ.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!

AP DSC 2024 : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఐదు నెలలు అవుతున్న సందర్భంగా వారి మానిఫెస్ట్ లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో దీపావళి కి ఉచిత సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే దీనికి సంబందించిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇక ఇప్పుడు మరో కీలక హామీ కూడా నెరవేర్చే దిశగా కసరత్తు జరుగుతుందని తెలుస్తుంది. ఏపీలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే యువత ఉద్యోగాల నోటిఫ్కేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మెగా డీఎస్సీతో పాటుగా ఇతర శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చూస్తున్నారు.

కూటమి అధికారం లోని రాగానే సీఎం చంద్రబాబు మెగా డీఎసీ 2024 ఫైల్ మీద సంతకం చేశారు. ఈ క్రమంలో టెట్ పరీక్ష జరిగింది. వీటి ఫలితాలు త్వరలో రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. నవంబర్ 6న ఉపాధ్యాయ భర్తీ నోటిఫికేషన్ వస్తుందని తెలుస్తుంది. ఇది ఉద్యోగార్ధుల కోసం మంచి శుభవార్త అని చెప్పొచ్చు.

AP DSC 2024 టెట్ ద్వారా క్వాలిఫై అవ్వాలి..

డీఎస్సీకి టెట్ ద్వారా క్వాలిఫై అవ్వాలి.. ఐతే ఈ నేపథ్యంలో టెట్ నిర్వహించగా దానికి సంబందించిన ఫలితాలు నవంబర్ 2న రిలీజ్ చేసేలా విద్యా శాఖ ఫిక్స్ అయ్యింది. టెట్ ఫలితాలు వచ్చిన నెక్స్ట్ డేనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేలా మొదట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐతే 3వ తేదీన ఆదివారం అవ్వడంతో 6న నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 16347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

AP DSC 2024 ఏపీలో మెగా డీఎస్సీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

AP DSC 2024 : ఏపీలో మెగా డీఎస్సీ.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!

రోస్టర్ వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. నోటిఫికేషన్ వచ్చిన 4 నెలల్లోనే నియామకాలు జరిగేలా చేయాలని చూస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వచ్చే వేసవిలో పోస్టింగ్ ఇచ్చి నెక్స్ట్ అకడమిక్ ఇయర్ కి విధుల్లో జాయిన్ అయ్యేలా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం మెగా డీఎస్సీలో మొత్తం 16347 పోస్టులు ఉన్నాయి. ఇనులో ఎస్జీటీ పోస్టులు 6371 కాగా స్కూల్ అసిస్టెంట్ లు 7725 ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1781 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 286 ప్రిన్సిపాల్ 52 పీ.ఈ.టీలు 132 ఉద్యోగాలు ఫిల్ చేయనున్నారు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది