YS Jagan : సీఎం జగన్ మరో స్కీమ్.. ప్రతి కుటుంబానికి అక్షరాలా లక్ష రూపాయలు
YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకో రెండు సంవత్సరాల సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే సీఎం జగన్ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. వచ్చే రెండేళ్లలో సాధ్యమైనంత వరకు ఎన్ని వీలైతే అన్ని స్కీమ్స్ ను ప్రవేశపెట్టాలని జగన్ యోచిస్తున్నారు. వచ్చే నెల అంటే అక్టోబర్ 1 నుంచి వైఎస్సార్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా అనే రెండు పథకాలను సీఎం జగన్ ప్రవేశపెట్టనున్నారు. ఆ పథకాల కింద పెళ్లి కానుకగా కొత్తగా పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు ఖర్చులకు కొంత నగదును ప్రభుత్వం అందజేయనుంది. వైఎస్సార్ కళ్యాణమస్తు పథకం కింద ఎస్సీలు అయితే రూ. లక్ష నగదు ఇవ్వనున్నారు. ఒకవేళ కులాంతర వివాహం అయితే అది ఎస్సీలు చేసుకుంటే రూ.1,50,000 ప్రభుత్వం నూతన దంపతులకు ఇవ్వనుంది.
ఒకవేళ ఎస్టీలు అయితే రూ. లక్ష, వాళ్లు కులాంతర వివాహం చేసుకుంటే దంపతుల్లో ఒకరు ఎస్టీ అయి ఉంటే రూ.1.20 లక్షలు ప్రభుత్వం ఇవ్వనుంది. బీసీలు అయితే వైఎస్సార్ కళ్యాణ మస్తు పథకం కింద రూ.50 వేలు ఇవ్వనున్నారు. బీసీల్లో కులాంతర వివాహం చేసుకుంటే రూ.75 వేలు ఇస్తుంది ప్రభుత్వం. షాదీ తోఫా అనే పథకం కింద మైనారిటీలకు ప్రభుత్వం లక్ష రూపాయలు చెల్లించనుంది.
YS Jagan : దివ్యాంగులకు అయితే రూ.1.5 లక్షలు అందివ్వనున్న ప్రభుత్వం
ఒకవేళ దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే వారికి పెళ్లి కానుకగా ప్రభుత్వం రూ.1.5 లక్షలు ఇవ్వనుంది. నిర్మాణ కార్మికులు, ఇతర కార్మికులు పెళ్లి చేసుకుంటే రూ.40 వేలను ప్రభుత్వం అందిస్తుంది. కాకపోతే ప్రభుత్వ నిబంధనలు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు పాటించాల్సి ఉంటుంది. పెళ్లి చేసుకునే అమ్మాయిల వయసు కనీసం 18 ఏళ్లు ఉండాలి. పెళ్లి కొడుకు వయసు కనీసం 21 ఏళ్లు ఉండాలి. ఈ కొత్త పథకాల గురించి ప్రజలకు ఏవైనా అనుమానాలు ఉంటే వాటికి సంబంధించిన పూర్తి వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో తెలుసుకోవచ్చు. లబ్ధిదారులకు నగదును గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ప్రభుత్వం అందిస్తుంది.