AP Parishad Elections : ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
AP Parishad Elections : ఏపీలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు విజయవంతంగా ముగియగా… తాజగా పరిషత్ ఎన్నికలకు కొత్త సీఈసీ నీలం సాహ్నీ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఈనేపథ్యంలో ఏపీ హైకోర్టు పరిషత్ ఎన్నికలకు బ్రేక్ వేసింది.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తున్నట్టు హైకోర్టు తాజాగా తీర్పు చెప్పింది. అయితే… రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ పై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
కనీసం పోలింగ్ కు నెల ముందు నుంచి ఎన్నికల కోడ్ అమలులో ఉండాలి… అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయగా… అంత తొందరగా పరిషత్ ఎన్నికలను నిర్వహించడం కోసం నోటిఫికేషన్ జారీ చేయడం ఏంటంటూ.. ఆయా పార్టీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా… దానిపై హైకోర్టు విచారణ చేపట్టింది.
నిబంధనలను బేఖాతరు చేస్తూ… కొత్త ఎన్నికల కమిషనర్.. నోటిఫికేషన్ ఇవ్వడం, వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడం ఏంటి? సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించకపోవడం ఏంటి? అంటూ ఆయా పార్టీలు హైకోర్టు దృష్టికి తీసుకురాగా…. దీనిపై విచారించిన హైకోర్టు.. ఎన్నికలపై స్టే ఇచ్చింది.
అయితే.. సుప్రీంకోర్టు ఎక్కడా… పోలింగ్ కంటే నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు చేయాలని ఎక్కడా స్పష్టం చేయలేదని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తరుపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. ఏది ఏమైనా.. పరిషత్ ఎన్నికలను ఇప్పుడు నిర్వహించవద్దంటూ… హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.