YS Jagan : జగనన్న వాలంటీర్ సేవలను హైకోర్టు కూడా మెచ్చిందా? టిడిపి ఫ్యాన్స్ కి గుండెల్లో రాయి..
YS Jagan: ఏపీలో సీఎం జగన్ పాలనను చాలా రాష్ట్రాలు పొగిడాయి. దానికి కారణం.. ఆయన ప్రారంభించిన పలు సంక్షేమ పథకాలు. ఆయన చేసిన కొన్ని ఆలోచనలను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేదు. ఏ రాష్ట్రంలో అమలు చేయలేదు. ఆయన ఆలోచనలో నుంచి పుట్టిందే ఏపీ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ. నిజానికి ఈ వ్యవస్థను నిర్మించడం అనేది చాలా గొప్ప ఆలోచన. ఇలాంటి ఆలోచన ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేదు. ప్రతి ఊళ్లో, ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ ఉంటారు. వాళ్లు ప్రభుత్వం తరుపున ప్రజలకు వారధిగా ఉంటారు. ఎలాంటి సంక్షేమ పథకం గురించి అయినా.. లబ్ధిదారుల ఎంపిక గురించి అయినా.. అన్నీ ప్రజలకు వివరిస్తారు. లబ్ధిదారులకు పథకాల ఫలాలను అందిస్తారు.
ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు వాలంటీర్ల వ్యవస్థపై చాలా విమర్శలు వస్తున్నాయి. కావాలని గ్రామ వాలంటీర్లతో వైసీపీ పార్టీ పనులు చేయించుకుంటోందని.. ప్రజాధనాన్ని వృథా చేసి వాళ్లతో పనులు చేయించుకుంటోందని ఆరోపిస్తున్నారు. కొన్ని పార్టీలు అయితే ఈ విషయంపై ఏకంగా ఎన్నికల సంఘానికే ఫిర్యాదు చేశాయి.తాజాగా ఏపీ వాలంటీర్ల వ్యవస్థపై ఏపీ హైకోర్టు షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. వైఎస్సార్ చేయూత పథకం విషయంలో వాలంటీర్ తప్పిదం వల్ల తమకు ఆ పథకాన్ని అర్హత లేకుండా అయిందని పల్నాడు జిల్లాకు చెందిన ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
YS Jagan: వాలంటీర్ల వ్యవస్థపై ఏపీ హైకోర్టు షాకింగ్ వ్యాఖ్యలు
దానిపై విచారణ చేసిన కోర్టు.. అసలు ప్రభుత్వ పథకాల విషయంలో లబ్ధిదారులను వాళ్లు ఎలా గుర్తిస్తారు. వాళ్లకు ఉన్న చట్టబద్ధత ఏంటి అంటూ కోర్టు ప్రశ్నించింది. దీనిపై ఫిబ్రవరి 28న కోర్టులో విచారణకు హాజరు కావాలని.. సెర్ప్ సీఈవోకి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అసలు.. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల గుర్తింపు అర్హతను నిర్ణయించే అధికారం వాలంటీర్లకు ఎక్కడిది అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అసలు ఆ వ్యవస్థకు సర్వీస్ నిబంధనలు ఉన్నాయా ? చట్టబద్ధత ఉందా అంటూ ప్రశ్నించింది. చూద్దాం మరి ఫిబ్రవరి 28న ఏం జరుగుతుందో?