జగన్ తీసుకున్న మరో కీలక నిర్ణయానికి హైకోర్టు బ్రేక్
ap high court : ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో చట్టాలకు మరియు నిర్ణయాలకు కోర్టులు అడ్డు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కువ శాతం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉన్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం వైఎస జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం నుండి మొదలుకుని నేడు వైజాగ్ భూముల అమ్మకం వరకు అన్ని నిర్ణయాల పట్ల రాష్ట్ర హైకోర్టు ( ap high court )అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే వచ్చింది. నేడు విశాఖ భూముల అమ్మకంకు వ్యతిరేకంగా కోర్టు ఇచ్చిన తీర్పు పై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వర్గాల వారు అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ap high court : అప్పటి తీర్పు ఈ కేసుకు కూడా…
వైజాగ్ లోని ప్రధాన ఏరియాల్లో ఐదు చోట్ల ఉన్న ప్రభుత్వ భూములను విక్రయించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. బిడ్డింగ్ ద్వారా ఈ అమ్మకంను జరపాలని కూడా నిర్ణయించింది. బిడ్డింగ్ లను ఆహ్వానించిన ప్రభుత్వంకు కోర్టు వెంటనే వాటన్నింటిని రద్దు చేయాలంటూ ఆదేశించింది. పలువురు వైజాగ్ భూములకు సంబంధించి కేసు నమోదు చేయడంతో వాటన్నింటిని ఒకే కేసుగా తీసుకుని కోర్టు విచారణ జరిపింది. గతంలోనే భూముల అమ్మకంకు ప్రభుత్వం కు అధికారం లేదని, భూములను ఇష్టానుసారంగా అమ్మకూడదు అంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. అదే తీర్పు ఇప్పుడు ఈ కేసులో వర్తిస్తుందని కోర్టు పేర్కొంది.
ap high court : ఆదాయం కోసం..
ఏపీ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి సమయంలో ఆర్థికంగా కాస్త అయినా వెసులుబాటు కల్పించుకునేందుకు అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్ లోని ఆ భూములను బిల్ట్ పేరుతో అమ్మేందుకు సిద్దం అయ్యి టెండర్లను కూడా పిలిచిన తర్వాత అనూహ్యంగా కేసు ap high court తీర్పు ప్రభుత్వంకు వ్యతిరేకంగా వచ్చింది. ఈ భూములు అమ్మిన డబ్బుతో సంక్షేమ పథకాలను అమలు చేయాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించాడు. కాని కొందరు టీడీపీ నాయకులు మరియు వైజాగ్ కు చెందిన వారు విశాఖ భూముల విషయంలో కోర్టుకు వెళ్లి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వచ్చేలా చేశారు. మరి ఈ తీర్పు పై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా ముందుకు వెళ్తారు అనేది చూడాలి.