Jagan – TDP : జగన్ ట్రాప్ లో పడి విలవిల కొట్టుకుంటున్న టీడీపీ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jagan – TDP : జగన్ ట్రాప్ లో పడి విలవిల కొట్టుకుంటున్న టీడీపీ !

 Authored By kranthi | The Telugu News | Updated on :21 April 2023,6:00 pm

Jagan – TDP : త్వరలోనే విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని సీఎం జగన్ చెబుతున్నారు. త్వరలోనే విశాఖ పాలనా రాజధాని అవుతుంది. వచ్చే సంవత్సరం ఈ సమయం వరకు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం కూడా స్పీడ్ పెంచింది. అందుకే.. ముందు మూడు రాజధానుల అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల శ్రీకాకుళం పర్యటనలోనూ సీఎం జగన్ అదే మాట చెప్పుకొచ్చారు. అధికార వికేంద్రీకరణలో భాగంగానే మూడు రాజధానులను ప్రకటించామని.. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులను తీసుకొస్తున్నట్టు సీఎం జగన్ స్పష్టం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

ap it minister gudivada amarnath comments on tdp leaders

ap it minister gudivada amarnath comments on tdp leaders

కానీ.. మూడు రాజధానుల అంశాన్ని కావాలని ప్రతిపక్ష పార్టీలు పెంట పెంట చేస్తున్నాయి. సీఎం జగన్ మూడు రాజధానుల అంశం అంతా బూటకం అన్నాయి. విశాఖ రాజధాని అంశాన్ని ఇప్పుడు లేవనెత్తడం వెనుక వివేకా హత్య కేసు ఉందని.. ఆ హత్య కేసు నుంచి ఏపీ ప్రజల దృష్టి మరల్చడం కోసమే సీఎం జగన్.. ఇలా విశాఖ రాజధాని అంశాన్ని ఇప్పుడు లేవనెత్తారు అంటూ ప్రతిపక్ష నేతలు మండిపడుతున్న నేపథ్యంలో మంత్రి గుడివాడ అమరనాథ్.. ప్రతిపక్ష టీడీపీపై సీరియస్ అయ్యారు.

Ap minister gudivada amarnath comments on TDP leaders

Jagan – TDP : మంచి ఉద్దేశంతో రాజధాని విశాఖను చేస్తుంటే మీ విమర్శలు ఏంటి?

సీఎం జగన్ మంచి ఉద్దేశంతో రాజధాని విశాఖను చేస్తుంటే.. టీడీపీ, జనసేన విమర్శలు చేయడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. పాలనా సౌలభ్యం కోసమే విశాఖ రాజధాని అని జగన్ చెప్పారని, దాని మీద ఎందుకు మాట్లాడరు అంటూ ఫైర్ అయ్యారు. అసలు.. విశాఖపట్టణం రాజధానికి టీడీపీ, జనసేన అనుకూలంగా ఉన్నారా లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి. అది చాలు అంటూ అమన్నాథ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో సీఎం ఎక్కడ నుంచి అయినా పాలించవచ్చు. దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. విశాఖ నుంచి సీఎం జగన్ పాలిస్తే మీకు వచ్చిన సమస్య ఏంటి. ఎందుకు ప్రతిపక్షాలు అంతలా ఉలిక్కి పడుతున్నాయి. అందరూ చూస్తుండగానే, విమర్శించే వారి కళ్ల ముందే విశాఖకు పాలన రాజధాని వస్తుంది.. అంటూ గుడివాడ అమర్నాథ్ టీడీపీని టార్గెట్ గా చేసుకొని విమర్శించారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది