Anil Kumar Yadav : టికెట్ల ధరలు పెంచి సామాన్య ప్రజలను దోచుకోవాలనుకున్నారా? వకీల్ సాబ్ పై మంత్రి ఫైర్?
Anil Kumar Yadav : ఏపీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్.. తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలపై విమర్శల ఎక్కుపెట్టారు. తాజాగా తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న అనీల్ కుమార్ యాదవ్… వకీల్ సాబ్ పైనా మండిపడ్డారు. ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ సినిమాపై ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఏపీ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తిరుపతి ఉపఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మంత్రి అనీల్ కుమార్ యాదవ్… ఇదే అంశంపై మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు.
వకీల్ సాబ్ సినిమా టికెట్ల ధరలు పెంచనీయలేదు అంటూ… జనసేన కార్యకర్తలు ధర్నాలు చేస్తున్నారు. బ్లాకుల్లో టికెట్లు అమ్ముకొని.. ఎక్కువ రేట్లు పెంచి… సామాన్య ప్రజలను దోచుకోవాలనుకుంటోంది మీరా? జగన్ మోహన్ రెడ్డినా? ప్రస్తుతం సినిమా టికెట్ ధర 250 రూపాయలు ఉంది. అయినా కూడా టికెట్ల రేట్లు పెంచాలంటూ ధర్నాలు చేయడం ఏంది? 250 రూపాయలే ఎక్కువ? అయినా కూడా టికెట్ ధరను 600 రూపాయలకు పెంచాల్సిన అవసరం ఏంటి? దీన్ని ఏమంటారు? దోచుకోవడం అనరా? సామాన్య ప్రజలను దోచుకోవడం కోసం… టికెట్ల ధరను పెంచాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడాన్ని ఏమంటారు? అంటూ మంత్రి అనీల్ ప్రశ్నించారు.
Anil Kumar Yadav : 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే… అందులో 80 కోట్లు మీకే ఇస్తున్నారు కదా?
ఈరోజుల్లో 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే… అందులో 80 కోట్లు రెమ్యునరేషన్ కిందనే పోతోంది. ఇక మిగిలిన 20 కోట్లతోనే సినిమా తీస్తున్నారు. మీకు మాత్రం అంత రెమ్యునరేషన్ కావాలి? ప్రజలు మాత్రం వాళ్ల జేబులకు చిల్లులు పెట్టుకొని సినిమా చూడాలా? ఏం… మీరు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే వచ్చిన నష్టం ఏంటి? అమాయకమైన అభిమానులు, ప్రేక్షకుల మీద రుద్ది.. అన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మీరు ఇష్టమున్నంత రెమ్యునరేషన్ తీసుకొని… మీ ఇష్టమున్నట్టు టికెట్ల ధరలు పెంచమంటారా? టికెట్ల ధరలు పెంచవద్దని… ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆపితే… జగన్ మోహన్ రెడ్డికి పవన్ అంటే భయం అంటారా? ఏ సాబ్ ను చూసీ ఆయన భయపడరు.. ఆ సాబ్ సున్నా… ఈ రాష్ట్రంలో ఒకే సాబ్ ఉన్నారు… అది సీఎం సాబ్… జగన్ సాబ్… అంటూ మంత్రి అనీల్ స్పష్టం చేశారు.