అవును ఆక్సిజన్ సరిపోవడం లేదు.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు.. ?
Avanthi srinivas ఏపీలో ప్రస్తుతం కరోనా తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. కరోనా ఏపీలో కోరలు చాచడంతో కరోనాను నియంత్రించడం కోసం ఏపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. కరోనా కట్టడి కోసం ఇప్పటికే మధ్యాహ్నం 12 నుంచి తెల్లారి ఉదయం 6 వరకు ఏపీ వ్యాప్తంగా కర్ఫ్యూను విధించింది. అయినప్పటికీ ఏపీలో కరోనా కేసులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా వైజాగ్ లో 300 పడకల ఆసుపత్రిని మంత్రి అవంతి శ్రీనివాస్ Avanthi srinivas ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా పరిస్థితిపై ఆయన చిరాకుపడ్డారు.
కరోనా పేషెంట్లకు ముఖ్యంగా కావాల్సింది ఆక్సిజన్, వ్యాక్సినేషన్, ఇంజిక్షన్. కానీ విచిత్రం ఏంటంటే.. ఇవన్నీ కేంద్రం చేతుల్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసేదేం లేదు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆక్సిజన్ విషయంలో నిందిస్తే ఎలా? ఏపీలో ఉన్న అన్ని ఆసుపత్రులు కరోనా కేంద్రాలుగా మారాయి. అయినా కూడా బెడ్స్ సరిపోవడం లేదు. దానికి మేం ఏం చేస్తాం.. ప్రభుత్వాన్ని నిందిస్తే ఏం వస్తుంది.. అంటూ మంత్రి అవంతి మండిపడ్డారు.
వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం చాలా చేస్తోంది : Avanthi srinivas
ఏపీలో వ్యాక్సినేషన్ కొరత ఉన్నది కానీ.. ప్రభుత్వం వ్యాక్సినేషన్ కోసం ఎంతో చేస్తోంది. అయినా కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దేశంలోనే అత్యుత్తమమైన వైద్య సేవలను ఏపీలో సీఎం జగన్ అందిస్తున్నారు. ప్రగతి భారతి ఫౌండేషన్ కూడా బాగా పనిచేస్తోంది. ఏపీ ప్రభుత్వం, ప్రగతి భారతి ఫౌండేషన్ సహకారంతోనే వైజాగ్ లో 300 పడకల కోవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేశాం. ఏపీలో ఆక్సిజన్ కొరత లేకుండా చేస్తున్నాం. 200 మెట్రిక్ టన్నులు ఉన్న ఆక్సిజన్ సరఫరాను… 600 మెట్రిక్ టన్నులకు పెంచినా కూడా ఆక్సిజన్ సరిపోవడం లేదు.. అంటూ మంత్రి తెలిపారు.
ఏపీలో కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం బాగానే ప్రయత్నిస్తోంది. ఇఫ్పటికే కేంద్రంతో మాట్లాడి.. వ్యాక్సినేషన్లను కూడా తీసుకొస్తోంది. ఆక్సిజన్ సరఫరాను పెంచింది. కానీ.. చాలామంది కరోనా రోగులు.. హైదరాబాద్ కు చికిత్స కోసం వెళ్తుంటే తెలంగాణ బార్డర్ వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు. దానిపై ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య పెద్ద రచ్చ నడుస్తోంది. ఏపీ సీఎం జగన్ కూడా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి.. ఏపీకి చెందిన కరోనా పేషెంట్లను హైదరాబాద్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.