Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్యాకేజీ లెక్కలు మొత్తం బయటపెట్టిన వైసీపీ మంత్రి !
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా అది ఈ మధ్య సంచలనమే అవుతోంది. కాపు సామాజికవర్గంలో అనైక్యతపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. పవన్ ఇప్పుడొచ్చి హడావుడి చేస్తున్నారు. బీసీలు, కాపులు కలిసి రాజ్యాధికారం చేపట్టాలట. బీసీలకు రాజ్యాధికారం అని పవన్ చెప్పడం వెనుక అసలు ఉద్దేశం ఏంటో రాజా స్పష్టం చేశారు. చంద్రబాబు పల్లకి మోయడం కోసమే బీసీలకు రాజ్యాధికారం అంటూ […]
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా అది ఈ మధ్య సంచలనమే అవుతోంది. కాపు సామాజికవర్గంలో అనైక్యతపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. పవన్ ఇప్పుడొచ్చి హడావుడి చేస్తున్నారు. బీసీలు, కాపులు కలిసి రాజ్యాధికారం చేపట్టాలట. బీసీలకు రాజ్యాధికారం అని పవన్ చెప్పడం వెనుక అసలు ఉద్దేశం ఏంటో రాజా స్పష్టం చేశారు. చంద్రబాబు పల్లకి మోయడం కోసమే బీసీలకు రాజ్యాధికారం అంటూ పవన్ చెప్పుకొస్తున్నారని అన్నారు. చంద్రబాబుతో పవన్ కు కొత్తేం కాదు కదా.
2014 నుంచి ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబుతోనే కలిసి నడుస్తున్నారని.. పవన్ ది ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ వ్యవహారం అన్నారు.కాపులు కాకపోతే బీసీలు తనకు, చంద్రబాబుకు ఓటేస్తారని దాడిశెట్టి రాజా ఆరోపిస్తున్నారు. కేవలం వైసీపీ ఓట్లను చీల్చేందుకే పవన్ పన్నాగాలు పన్నుతున్నారని ఆయన విమర్శించారు. అసలు నువ్వు ముందు ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చావు. నీకు బీసీలు ఎందుకు ఓట్లేయాలి. నువ్వు ఒక బుడ్డోడికి కూడా తక్కువే. నీ రాజకీయం ఏంటో.. వాళ్లకు కూడా తెలుసు. పవన్ ఎంత యాక్టింగ్ చేస్తే అంత ప్యాకేజ్ పెరుగుతుంది.. అంటూ రాజా పవన్ పై విమర్శల అస్త్రాన్ని సంధించారు.
Pawan Kalyan : ఇవాళ పవన్ డ్యాన్స్ నాటు నాటు పాటకు మించి ఉంటుంది
ఇవాళ పవన్ కళ్యాణ్ అసలు డ్యాన్స్ ఉంటుందని అది నాటు నాటు పాటను మించి ఉంటుందని రాజా స్పష్టం చేశారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ నే పవన్ చదువుతారు. అంతకుమించి పవన్ చేసేదేం లేదు. ఆర్ఆర్ఆర్ కు వచ్చిన ఆస్కార్ కంటే కూడా పవన్ యాక్టింగ్ ఆస్కార్ రేంజ్ లో ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ ను కాపులు ఎలాగూ నమ్మే పరిస్థితి లేదు. కాపులను పక్కన పెడితే.. కనీసం ఎస్సీ, ఎస్టీలపై ఎందుకు కేసులు పెట్టావని చంద్రబాబుని అడిగివా? అని రాజా నిలదీశారు. మీ కుయుక్తులన్నీ ప్రజలకు తెలుసు. కులాలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలని చూస్తే ప్రజలే మిమ్మల్ని ఈసారి ఏపీ నుంచి తరిమేస్తారు అని ఆయన మండిపడ్డారు.