Gudivada Amarnath : జగన్ తరఫున కెసిఆర్ కి స్ట్రాంగ్ ఆన్సర్ ఇచిన గుడివాడ అమరనాథ్ !
Gudivada Amarnath : ప్రస్తుతం ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించే చర్చ నడుస్తోంది. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే ఎవరైనా కొనుక్కోవచ్చు. వేరే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్టీల్ ప్లాంట్ ను కొనుక్కొని మెయిన్ టెన్ చేయొచ్చు. పారిశ్రామిక వేత్తలు కూడా కొనుగోలు చేయొచ్చు. కేంద్రం కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు అడుగులు వేస్తోంది. దీనిపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణకు ఒప్పుకోవడం లేదు.
దీనిపై తెలంగాణ ప్రభుత్వం కూడా భగ్గుమంటోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఎలా ప్రైవేటీకరణ చేస్తారు అని అంటూనే.. మరోవైపు స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ ప్రక్రియను అధ్యయనం చేయాలంటూ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారట. దీనిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. అయితే.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించకూడదని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.
Gudivada Amarnath : విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించకూడదని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది
ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ వేసేందుకు సిద్ధం అయితే.. తాము బిడ్డింగ్ లో పాల్గొంటామని ఎలా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తాము అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకే వ్యతిరేకం. అదే తమ విధానం.. ఆ ప్లాంట్ ను తాము ఎందుకు కొంటాం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం కరెక్ట్ కాదని గతంలో కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు బిడ్ వేస్తాం అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్. ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వం బిడ్డింగ్ వేస్తే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేయాలనేది వాళ్ల ఉద్దేశమా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఏపీ ప్రజల సెంటిమెంట్.. అంటూ కేసీఆర్ కు స్ట్రాంగ్ రిప్లయి ఇచ్చారు అమర్నాథ్.