AP Muncipal Elections Result : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఫ్యాన్‌దే హవా.. ఒక్కొక్కటిగా మున్సిపాలిటీలు కైవసం..!
Muncipal Elections Result: ఆంధప్రదేశ్‌లోని మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు తెలిపేందుకుగాను అదికారులు బుధవారం కౌంటింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేస్తోంది.అధికారులు కౌంటింగ్ పూర్తి కాగానే ఎప్పటికప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు.
Muncipal Elections Result: అధికార పార్టీదే విజయం..

Ysrcp
ఇప్పటికే ఆకివీడు నగర పంచాయతీని వైసీపీ కైవసం చేసుకుంది. ఇక్కడి 20 వార్డుల్లో 12 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విక్టీరీ సాధించారు. పెనుకొండ మున్సిపాలిటీ సైతం అధికార వైసీపీ గెలుచుకుంది. బుచ్చి నగర పంచాయితీలో వైసీపీ దూసుకుపోతున్నది. అనంతరపురం జిల్లాలోని పెనుకొండ నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులకుగాను అధికార వైసీపీ 17 స్థానాలను గెలుచుకుంది.
కుప్పంలోనూ వైసీపీ హవా కొనసాగింది. అక్కడి 14 వార్డుల్లో 10 వార్డులను అధికార వైసీపీ గెలుచుకుంది. దాచేపల్లి నగర పంచాయతీ సైతం వైసీపీ చేతిలోకే వెళ్లింది. కర్నూలు, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, అమరావతి జిల్లాల్లో అధికార వైసీపీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నది.