AP New Cabinet : అందరి దృష్టి ఇప్పుడు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌పైనే.. ఆ ప‌ద‌వులు వారికేనంట‌

AP New Cabinet : వైఎస్ జగన్మోహ‌న్ రెడ్డి అధికాంరలోకి వచ్చాక తొలి కేబినెట్‌ ఏర్పాటు చేసిన తర్వాత ఐదేళ్లు పదవులు ఉండబోవని.. మధ్యలోనే మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై హైకమాండ్ కసరత్తు చేస్తోంది. దీనికి ముహూర్తం కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఏప్రిల్‌ 11వ తేదీన కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించే విధంగా ప్లాన్‌ చేస్తున్న‌ట్లు స‌మాచారం.మంత్రి పదవుల నుంచి తొలగించినా వారిని పూర్తిగా పక్కనబెట్టినట్టు కాదని పార్టీ వ్యవహారాల్లో వారు కీలకంగా పనిచేస్తారని సీఎం జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే, పదవులు పోయిన వారికి జిల్లాలకు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగిస్తామని, పార్టీ కోసం పనిచేయాలని ఇదివరకే మంత్రులకు జగన్ సూచించారు. అయితే కొత్త కేబినెట్‌ కొలువుదీరకముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఉండొచ్చునని అంటున్నారు. కాగా ప్ర‌స్తుతం మంత్రులుగా కొన‌సాగుతున్నవారిలో కొత్త‌గా ప‌ద‌వులు ఆశించేవారిలో టెన్ష‌న్ నెల‌కొంది.అయితే ఎవ‌రి ప‌దవులు ఉడ‌నున్నాయ‌నేది కూడా ఆసక్తికరంగా మారింది. కేబినెట్‌లో ఉన్నవారిలో ఒక టెన్షన్‌ అయితే ఇక కేబినెట్‌ పదవులు ఆశిస్తున్నవారిలోనూ ఈసారైనా పదవి దక్కుతుందా? అనే టెన్షన్‌ నెలకొంది. దీంతో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటార‌నేది స‌ర్వ‌త్రా ఆసక్తికంగా మారింది.

ap new cabinet expansion on likely april 11th ys jagan to meet biswabhusan harichandan 8Th

AP New Cabinet : గ‌వ‌ర్న‌ర్ తో మీటింగ్

కాగా వచ్చే నెల 8న గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ కానున్న‌ట్లు తెలుస్తోంది. ఆ సమావేశంలో గవర్నర్‌కు కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ గురించి వివరిస్తార‌ని, వచ్చే నెల 11వ తేదీ అపాయింట్‌మెంట్‌ కావాలని కోరనున్న‌ట్లు స‌మాచారం. 11వ తేదీనే కొత్త కేబినెట్ కొలువు తీరనున్న‌ట్లు తెలుస్తోంది . అదే రోజు కొత్త మంత్రులు, పాత మంత్రులకు సీఎం జగన్‌ విందు ఇవ్వ‌నున్న‌ట్లు టాక్. కొత్త మంత్రులకు ఒక రోజు ముందుగా మాత్రమే సమాచారం ఇవ్వనున్న‌ట్లు తెలుస్తోంది. కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ డేట్‌ను అధికారికంగా ప్రకటించకపోయినా ఫిక్స్‌ అయినట్టేనని సమాచారం.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago