AP New Cabinet : అందరి దృష్టి ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణపైనే.. ఆ పదవులు వారికేనంట
AP New Cabinet : వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికాంరలోకి వచ్చాక తొలి కేబినెట్ ఏర్పాటు చేసిన తర్వాత ఐదేళ్లు పదవులు ఉండబోవని.. మధ్యలోనే మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై హైకమాండ్ కసరత్తు చేస్తోంది. దీనికి ముహూర్తం కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 11వ తేదీన కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.మంత్రి పదవుల నుంచి తొలగించినా వారిని పూర్తిగా పక్కనబెట్టినట్టు కాదని పార్టీ వ్యవహారాల్లో వారు కీలకంగా పనిచేస్తారని సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే, పదవులు పోయిన వారికి జిల్లాలకు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగిస్తామని, పార్టీ కోసం పనిచేయాలని ఇదివరకే మంత్రులకు జగన్ సూచించారు. అయితే కొత్త కేబినెట్ కొలువుదీరకముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఉండొచ్చునని అంటున్నారు. కాగా ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్నవారిలో కొత్తగా పదవులు ఆశించేవారిలో టెన్షన్ నెలకొంది.అయితే ఎవరి పదవులు ఉడనున్నాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. కేబినెట్‌లో ఉన్నవారిలో ఒక టెన్షన్ అయితే ఇక కేబినెట్ పదవులు ఆశిస్తున్నవారిలోనూ ఈసారైనా పదవి దక్కుతుందా? అనే టెన్షన్ నెలకొంది. దీంతో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తికంగా మారింది.

ap new cabinet expansion on likely april 11th ys jagan to meet biswabhusan harichandan 8Th
AP New Cabinet : గవర్నర్ తో మీటింగ్
కాగా వచ్చే నెల 8న గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఆ సమావేశంలో గవర్నర్‌కు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ గురించి వివరిస్తారని, వచ్చే నెల 11వ తేదీ అపాయింట్‌మెంట్ కావాలని కోరనున్నట్లు సమాచారం. 11వ తేదీనే కొత్త కేబినెట్ కొలువు తీరనున్నట్లు తెలుస్తోంది . అదే రోజు కొత్త మంత్రులు, పాత మంత్రులకు సీఎం జగన్ విందు ఇవ్వనున్నట్లు టాక్. కొత్త మంత్రులకు ఒక రోజు ముందుగా మాత్రమే సమాచారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ డేట్‌ను అధికారికంగా ప్రకటించకపోయినా ఫిక్స్ అయినట్టేనని సమాచారం.