Chiranjeevi : చిరంజీవిని ఇంకా ఇంకా వదలని రాజకీయం.. పొలిటికల్ బాంబు పేల్చిన రాహుల్ గాంధీ..!!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల గురించి చాలాసార్లు వ్యాఖ్యలు చేశారు. నేను ఒకప్పటి చిరంజీవిని కాను. రాజకీయాలను పూర్తిగా వదిలేశాను. ఇప్పుడు రాజకీయాల జోలికి కూడా నేను పోవడం లేదు. రాజకీయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంటూ చాలా చెప్పారు. అయితే.. చిరంజీవి రాజకీయాలను వదిలేశారు కానీ.. రాజకీయాలు చిరంజీవిని వదిలేలా లేవు. అవును.. నిజం.. ఎందుకంటే.. ప్రతి ఒక్కరు పోయి చిరంజీవినే రాజకీయాల్లోకి లాగుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలు. ఇటీవల.. మినిస్టర్ రోజా మెగా ఫ్యామిలీపై కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారని.. వాళ్ల మధ్య ఇంకా సత్సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. చిరంజీవి కాంగ్రెస్ కు దూరంగా ఉన్నా.. ఏపీలో కాంగ్రెస్ పార్టీని నడిపించాలంటూ కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి ఆయనకు చాలా సార్లు ఆఫర్లు వచ్చాయి. ఏపీ పీసీసీ చీఫ్ గానూ ఉండాలని అన్నారు. కానీ.. చిరంజీవి ఒప్పుకోలేదు. మరోవైపు వైసీపీ అధికారంలోకి వచ్చాక.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. అటు జగన్ తోనూ సత్సంబంధాలనే నెరుపుతున్నారు చిరంజీవి.
Chiranjeevi : వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీ సీటు కూడా ఇస్తా అన్నారా?
వైసీపీకి మద్దతుగా చిరంజీవి ఉన్నారని.. అందుకని రాజ్యసభ ఎంపీ సీటును వైసీపీ నుంచి ఇస్తున్నారని అన్నారు. కానీ.. దానిపై చిరంజీవి కూడా స్పష్టత ఇచ్చారు. తమ మధ్య సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలు తప్పించి రాజకీయ అంశాలేవీ చర్చకు రాలేదన్నారు. తాజాగా ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు చిరంజీవిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారన్నారు. అంతే కాదు.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో చిరంజీవికి మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. అంటే.. చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనందున.. ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెప్పారా? లేక.. వచ్చే ఎన్నికల్లో 2024 లో చిరంజీవి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా? అనే పుకార్లు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో షికారు చేస్తున్నాయి.