RAtion Card | ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల సవరణకు అవకాశం.. అక్టోబర్ 30 వరకు గడువు
RAtion Card | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు అధిక శాతం లబ్ధిదారులకు ఈ కార్డులు అందగా, కొన్ని కార్డుల్లో వివరాలు తప్పుగా రావడంతో సవరణల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ ప్రక్రియకు ఆఖరి తేది అక్టోబర్ 30గా నిర్దేశించారు.

#image_title
తప్పులుంటే వెంటనే అప్డేట్ చేసుకోండి
స్మార్ట్ కార్డులో పేరుల స్పెల్లింగ్, ఇంటి నంబర్, పోటో, లేదా ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు తప్పుగా ఉన్నవారు సచివాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. అక్కడ విలేజ్ వాలంటీర్లు, వార్డ్ సచివాలయ సిబ్బంది, వీఆర్‌ఓలు సాయంతో దరఖాస్తు చేయవచ్చు.
ఎప్పటిలోగా సవరణ చేసుకోవాలి?
అక్టోబర్ 30లోపు తప్పులున్న కార్డులకు మార్పులు చేసుకోవాలి. తర్వాత దరఖాస్తులను ఆమోదించేందుకు అవకాశం ఉండకపోవచ్చు.మంత్రులు వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని మిగిలిన 20 శాతం కుటుంబాలకు త్వరలో స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నారు.9 జిల్లాల్లో సెప్టెంబర్ 15 నుంచి కార్డుల పంపిణీ ప్రారంభం అవుతుంది.
స్మార్ట్ రేషన్ కార్డు ప్రత్యేకతలు
పాత రేషన్ కార్డులకు బదులుగా, ATM కార్డుల రూపంలో స్మార్ట్ రేషన్ కార్డులు
QR కోడ్ ద్వారా ఆధునికత
కార్డు ముందు భాగంలో: లబ్ధిదారుడి ఫొటో, రేషన్ షాప్ నంబర్, ప్రభుత్వ ల لوگో
వెనుక భాగంలో: కుటుంబ సభ్యుల వివరాలు