YSR Free Crop Insurance : దేశంలో ఎక్కడ లేని ఉచిత పంట భీమా ఏపీలో..!
YSR Free Crop Insurance : ఏపీలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అందుతూ జనాల యొక్క అభివృద్దికి దోహదం చేస్తోంది. వాలంటీర్ వ్యవస్థను దేశంలో అనేక రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ఆయా రాష్ట్రాలు ముందుకు వస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఉచిత పంట భీమా కూడా దేశంలోని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయంటూ వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య అన్నారు.
రైతులు తమ పంటలకు భీమా పొందాలి అంటే గతంలో పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉండేది. కాని ఇప్పుడు రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే పంట భీమా పొందే విధంగా ఏపీ ప్రభుత్వం పథకం తీసుకు వచ్చింది. వైఎస్సార్ ఉచిత పంట భీమా పేరుతో రైతుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం పాటు పడుతుంది. ప్రీమియం చెల్లించకుండా భీమా పొందే అవకాశం ఏపీ రైతులకు తప్ప దేశంలో ఎక్కడ.. ఎవరికి లేదు అంటూ వైకాపా నాయకులు అంటున్నారు. గత ఏడాది ఖరీఫ్ లో 26 పంటలకు పంట భీమా ను అమలు చేయడం జరిగింది.
దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలను రైతులకు భీమా చెల్లించారు. ఇంకా ఎవరైనా పంట భీమా అందని వారు ఉంటే 15 రోజుల్లో దరకాస్తు చేసుకోవచ్చు అంటూ పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. ఈ ఏడాది రెట్టింపు భీమా సాయం రైతులకు అందించే విధంగా కొత్త భీమా పద్దతిని తీసుకు వస్తున్నట్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారణాల వల్ల పంటలు నష్టపోయిన వారికి ఈ భీమా ను చెల్లించేందుకు వైఎస్సార్ రైతు భీమా పథకంను తీసుకు రావడం జరిగింది. ఈ భీమా ప్రతి ఒక్క రైతుకు భరోసాని కలిగిస్తుంది.