Business Ideas: ఉద్యోగం రాక బాధపడుతున్నారా?.. తక్కువ పెట్టుబడితో లక్షల ఆదాయం ఇచ్చే ట్రెండింగ్ బిజినెస్ ఇదే!
ప్రధానాంశాలు:
Business Ideas: ఉద్యోగం రాక బాధపడుతున్నారా?.. తక్కువ పెట్టుబడితో లక్షల ఆదాయం ఇచ్చే ట్రెండింగ్ బిజినెస్ ఇదే!
Business Ideas: ఉద్యోగం దొరకలేదని లేదా చేస్తున్న జాబ్‌లో సరైన ఆదాయం లేదని చాలా మంది యువత(youth) నిరాశ చెందుతున్నారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఉద్యోగం లేకపోయినా సొంతూరిలోనే ఉండి మంచి ఆదాయం సంపాదించే అవకాశాలు ఉన్నాయి. అలాంటి అవకాశాల్లో ఇప్పుడెంతో ట్రెండ్ అవుతున్నది ఫుడ్ బిజినెస్(Food business). ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి ప్రతీ నెలా లక్ష రూపాయల వరకు నికర లాభం పొందే అవకాశం ఉన్న వ్యాపారం ఇది. అదే మొబైల్ టిఫిన్ సర్వీస్.
Business Ideas: ఉద్యోగం రాక బాధపడుతున్నారా?.. తక్కువ పెట్టుబడితో లక్షల ఆదాయం ఇచ్చే ట్రెండింగ్ బిజినెస్ ఇదే!
Business Ideas: మొబైల్ టిఫిన్ సర్వీస్ అంటే ఏమిటి?
మొబైల్ టిఫిన్ సర్వీస్ అంటే బైక్ లేదా చిన్న వాహనం సాయంతో టిఫిన్లు, బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్‌ను నేరుగా కస్టమర్ల దగ్గరికి తీసుకెళ్లి అమ్మడం. ఈ మధ్యకాలంలో ప్రతి సెంటర్, ఆఫీస్ ప్రాంతం, కాలేజీల దగ్గర బైక్‌పై టిఫిన్స్ అమ్ముతున్న వారిని చూస్తూనే ఉన్నాం. ఇంట్లోనే శుభ్రంగా తయారు చేసిన ఇడ్లీ, దోసె, పూరి, ఉప్మా లాంటి టిఫిన్స్‌ను ప్రజలకు అందించడం ఈ బిజినెస్ ప్రత్యేకత. రుచి, నాణ్యత, పరిశుభ్రత ఉంటే కస్టమర్లు ఆటోమేటిక్‌గా పెరుగుతారు.
Business Ideas: ఎంత పెట్టుబడి అవసరం? లాభాలు ఎలా ఉంటాయి?
ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి భారీ పెట్టుబడి అవసరం లేదు. ఒక బైక్, చిన్న క్యారియర్, గ్యాస్ స్టౌ, పాత్రలు, ముడిసరుకులు ఉంటే సరిపోతుంది. ప్రారంభ పెట్టుబడి సుమారు రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష లోపే ఉంటుంది. ఒక్క ప్లేట్ టిఫిన్‌ను రూ. 30గా నిర్ణయించినట్లు అనుకుందాం. రోజుకు 200 ప్లేట్లు అమ్మితే రోజువారీ ఆదాయం రూ. 6,000 వరకు వస్తుంది. అదే నెలకు లెక్కిస్తే సుమారు రూ. 1.8 లక్షల టర్నోవర్ వస్తుంది. గ్యాస్, ముడిసరుకులు, ఇంధనం, ఇతర ఖర్చులు కలిపి నెలకు రూ. 70-80 వేల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఇవన్నీ పోగా నెలకు రూ. 1 లక్ష వరకు నికర లాభం పొందే అవకాశం ఉంది. ఏడాదికి ఇది రూ. 12 లక్షల లాభంగా మారుతుంది.
Business Ideas: ఎవరికీ ఈ బిజినెస్ బెస్ట్ ఆప్షన్?
ఫుడ్ తయారీపై ఆసక్తి ఉన్నవారికి సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం. ఉద్యోగం రాలేదని బాధపడేవారు ఇంటి నుంచి బయటకు వెళ్లలేని మహిళలు, చిన్న వ్యాపారం మొదలుపెట్టాలనుకునే యువత అందరికీ ఈ బిజినెస్ సరైన ఆప్షన్. మంచి రుచి, నిజాయితీ, కస్టమర్ అవసరాలను అర్థం చేసుకుంటే ఈ మొబైల్ టిఫిన్ సర్వీస్‌తో స్థిరమైన ఆదాయం పొందవచ్చు. జాబ్ కోసం ఎదురుచూడకుండా మీ చేతుల్లో ఉన్న నైపుణ్యంతోనే భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం ఇది.