Heart Stroke | యువతలో గుండెపోటు కేసులు పెరుగుదల.. వైద్యుల హెచ్చరిక
Heart Stroke | ప్రస్తుతం గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 18 మిలియన్ల మంది గుండె సంబంధిత వ్యాధుల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిలో గుండెపోటు అత్యంత సాధారణ కారణంగా నిలుస్తోంది.

#image_title
అనారోగ్యకర జీవనశైలి, మానసిక ఒత్తిడి, ధూమపానం, ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, జంక్ ఫుడ్ అధికంగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం వంటి కారణాలు గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
గుండెపోటు రాకముందే శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుందని, వాటిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరించారు. ఛాతీ ఒత్తిడి, ఎడమ చేయి, మెడ, దవడ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమట పట్టడం, తల తిరగడం వంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచించారు. మహిళల్లో వెన్ను లేదా కడుపు నొప్పి, వికారం, అసాధారణ అలసట కూడా గుండెపోటు సూచనలుగా ఉండవచ్చని తెలిపారు.
గుండెపోటు ప్రమాదం వృద్ధులు, అధిక రక్తపోటు లేదా మధుమేహం ఉన్నవారు, ధూమపానం–మద్యం అలవాటు ఉన్నవారు, ఊబకాయం బాధపడుతున్నవారు, అలాగే కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.