Categories: BusinessNews

Business Ideas: ఉద్యోగం రాక బాధపడుతున్నారా?.. తక్కువ పెట్టుబడితో లక్షల ఆదాయం ఇచ్చే ట్రెండింగ్ బిజినెస్ ఇదే!

Advertisement
Advertisement

Business Ideas: ఉద్యోగం దొరకలేదని లేదా చేస్తున్న జాబ్‌లో సరైన ఆదాయం లేదని చాలా మంది యువత(youth) నిరాశ చెందుతున్నారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఉద్యోగం లేకపోయినా సొంతూరిలోనే ఉండి మంచి ఆదాయం సంపాదించే అవకాశాలు ఉన్నాయి. అలాంటి అవకాశాల్లో ఇప్పుడెంతో ట్రెండ్ అవుతున్నది ఫుడ్ బిజినెస్(Food business). ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి ప్రతీ నెలా లక్ష రూపాయల వరకు నికర లాభం పొందే అవకాశం ఉన్న వ్యాపారం ఇది. అదే మొబైల్ టిఫిన్ సర్వీస్.

Advertisement

Business Ideas: ఉద్యోగం రాక బాధపడుతున్నారా?.. తక్కువ పెట్టుబడితో లక్షల ఆదాయం ఇచ్చే ట్రెండింగ్ బిజినెస్ ఇదే!

Business Ideas: మొబైల్ టిఫిన్ సర్వీస్ అంటే ఏమిటి?

మొబైల్ టిఫిన్ సర్వీస్ అంటే బైక్ లేదా చిన్న వాహనం సాయంతో టిఫిన్లు, బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్‌ను నేరుగా కస్టమర్ల దగ్గరికి తీసుకెళ్లి అమ్మడం. ఈ మధ్యకాలంలో ప్రతి సెంటర్‌, ఆఫీస్ ప్రాంతం, కాలేజీల దగ్గర బైక్‌పై టిఫిన్స్ అమ్ముతున్న వారిని చూస్తూనే ఉన్నాం. ఇంట్లోనే శుభ్రంగా తయారు చేసిన ఇడ్లీ, దోసె, పూరి, ఉప్మా లాంటి టిఫిన్స్‌ను ప్రజలకు అందించడం ఈ బిజినెస్ ప్రత్యేకత. రుచి, నాణ్యత, పరిశుభ్రత ఉంటే కస్టమర్లు ఆటోమేటిక్‌గా పెరుగుతారు.

Advertisement

Business Ideas: ఎంత పెట్టుబడి అవసరం? లాభాలు ఎలా ఉంటాయి?

ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి భారీ పెట్టుబడి అవసరం లేదు. ఒక బైక్, చిన్న క్యారియర్, గ్యాస్ స్టౌ, పాత్రలు, ముడిసరుకులు ఉంటే సరిపోతుంది. ప్రారంభ పెట్టుబడి సుమారు రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష లోపే ఉంటుంది. ఒక్క ప్లేట్ టిఫిన్‌ను రూ. 30గా నిర్ణయించినట్లు అనుకుందాం. రోజుకు 200 ప్లేట్లు అమ్మితే రోజువారీ ఆదాయం రూ. 6,000 వరకు వస్తుంది. అదే నెలకు లెక్కిస్తే సుమారు రూ. 1.8 లక్షల టర్నోవర్ వస్తుంది. గ్యాస్, ముడిసరుకులు, ఇంధనం, ఇతర ఖర్చులు కలిపి నెలకు రూ. 70-80 వేల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఇవన్నీ పోగా నెలకు రూ. 1 లక్ష వరకు నికర లాభం పొందే అవకాశం ఉంది. ఏడాదికి ఇది రూ. 12 లక్షల లాభంగా మారుతుంది.

Business Ideas: ఎవరికీ ఈ బిజినెస్ బెస్ట్ ఆప్షన్?

ఫుడ్ తయారీపై ఆసక్తి ఉన్నవారికి సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం. ఉద్యోగం రాలేదని బాధపడేవారు ఇంటి నుంచి బయటకు వెళ్లలేని మహిళలు, చిన్న వ్యాపారం మొదలుపెట్టాలనుకునే యువత అందరికీ ఈ బిజినెస్ సరైన ఆప్షన్. మంచి రుచి, నిజాయితీ, కస్టమర్ అవసరాలను అర్థం చేసుకుంటే ఈ మొబైల్ టిఫిన్ సర్వీస్‌తో స్థిరమైన ఆదాయం పొందవచ్చు. జాబ్ కోసం ఎదురుచూడకుండా మీ చేతుల్లో ఉన్న నైపుణ్యంతోనే భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం ఇది.

Recent Posts

PM Svanidhi : ఆధార్ ఉంటే చాలు.. ఆస్తి హామీ లేకుండానే రూ.90 వేల వరకు రుణం..పీఎం స్వనిధి పథకంతో కొత్త ఆశలు

PM Svanidhi: చిన్నచిన్న వ్యాపారాలే ఆధారంగా జీవించే వీధి వ్యాపారుల(Street vendors)కు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం…

47 minutes ago

Today Gold Rate 18 January 2026 : బంగారం కొనేవారికి ఉరట..ఈరోజు గోల్డ్, సిల్వర్‌ రేట్లు ఎంతంటే?

Today Gold Rate 18 January 2026 : గత కొద్ది రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పెరుగుతూ రావడం…

3 hours ago

Ram Charan : తారక్ మ్యాడ్ డ్రైవర్..! జూనియర్ ఎన్టీఆర్ డ్రైవింగ్ స్కిల్స్‌పై రామ్ చరణ్ కామెంట్స్ వైరల్

Ram Charan : టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి సోషల్…

4 hours ago

Winter Season : చలికాలంలో ఒక్కొక్కరికి ఒక్కో అనుభూతి ఎందుకు?.. శరీరం చెప్పే సైన్స్ ఇదేనా?

Winter Season : చలికాలం మొదలైతే మన చుట్టూ ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. కొందరు మంచు గాలులు వీచినా…

5 hours ago

Mouni Amavasya : మౌని అమావాస్య ప్రాముఖ్యత : ఈ పవిత్ర రోజున పాటించాల్సిన నియమాలు, చేయవలసిన పూజలు..!

Mouni Amavasya : మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తారు. హిందూ సంప్రదాయాల్లో ఈ తిథికి విశేషమైన…

6 hours ago

Zodiac Signs January 18 2026 : జ‌న‌వ‌రి 18 ఆదివారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs January 18 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…

7 hours ago

Kavitha : సిద్దిపేట ఎమ్మెల్యేగా క‌విత‌… ఏం జ‌రుగుతుంది..?

Kavitha : ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో చర్చనీయాంశంగా మారుతూనే…

15 hours ago

Mana Shankara Vara Prasad Garu Movie : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘మన శంకర వరప్రసాద్ గారు’.. 5 రోజుల్లో రూ.226 కోట్ల గ్రాస్

Mana Shankara Vara Prasad Garu Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్‌లో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్…

16 hours ago