Bed Wetting | పిల్లల బెడ్ వెట్టింగ్ సమస్యకు చెక్ పెట్టండి .. నిపుణులు సూచించిన టిప్స్ ఇవే!
Bed Wetting | రాత్రిపూట పిల్లలు బెడ్ తడపడం (Bed Wetting) చాలా సాధారణమైన సమస్య. మూడు సంవత్సరాల లోపు పిల్లల్లో ఇది సాధారణమే అయినా, వయసు పెరిగినా అలవాటు కొనసాగితే తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే అంశంగా మారుతుంది. వైద్యుల ప్రకారం, ఈ సమస్యకు పలు శారీరక, మానసిక కారణాలు ఉండవచ్చు. అయితే కొన్ని సరళమైన మార్పులతో దీన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
#image_title
నిద్రకు ముందు టాయిలెట్‌కి పంపండి
పిల్లలు నిద్రపోయే ముందు తప్పనిసరిగా ఒకసారి మూత్ర విసర్జన చేయించాలి. ఇలా చేస్తే బ్లాడర్ ఖాళీ అవుతుంది, రాత్రిపూట పక్క తడిపే అవకాశం తగ్గుతుంది. మధ్య రాత్రి తల్లిదండ్రులు లేవగానే పిల్లల్ని కూడా మెలకువ పెట్టి టాయిలెట్‌కి తీసుకెళ్లడం కూడా మంచిది.
పడుకునే ముందు నీరు తగ్గించండి
రాత్రి పూట ఎక్కువగా నీరు లేదా పాలు ఇవ్వడం వల్ల బ్లాడర్ త్వరగా నిండిపోతుంది. దీంతో నిద్రలోనే మూత్ర విసర్జన జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పడుకునే గంట ముందు నుంచే ద్రవాల పరిమాణాన్ని తగ్గించడం మంచిది.
శిక్షలు వద్దు
పిల్లలను తిట్టడం, శిక్షించడం వంటివి చేయకూడదు. అలాంటి భయం వల్ల వాళ్లు టాయిలెట్ అవసరం వచ్చినా చెప్పడానికి సిగ్గుపడతారు. ఫలితంగా బెడ్ తడిపేస్తారు. కాబట్టి ఓర్పుతో ప్రోత్సహిస్తూ మాట్లాడాలి.
టాయిలెట్ వస్తే లేపమని చెప్పండి
“మూత్రం వస్తే అమ్మా, నాన్నని లేపు” అని పిల్లలకు చెప్పడం అలవాటు చేయాలి. పిల్లలు ఒక్కసారిగా నేర్చుకోరు కాబట్టి పదేపదే గుర్తు చేయడం అవసరం.
నిపుణులను సంప్రదించండి
ఈ సమస్య తరచుగా జరుగుతూ ఉంటే, డాక్టర్ లేదా పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది. వారు సూచించే ట్రీట్‌మెంట్ లేదా బిహేవియరల్ థెరపీ ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.